JEE Main 2025: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 అభ్యర్థుల ఫొటోల్లో తేడాలు; అప్ డేట్ చేసుకోవడానికి విండో ఓపెన్
JEE Main 2025 Session 1 Exam: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫొటోలో తేడాలు ఉన్నట్లు, పలువురు అభ్యర్థుల ఫొటోలు స్పష్టంగా లేవని ఎన్టీఏ గుర్తించింది. విద్యార్థులు తమ దరఖాస్తుల్లోని ఫొటోలను మార్చుకునే వీలు కల్పించడానికి వెబ్ సైట్ లో విండో ఓపెన్ చేసింది.
JEE Main 2025 Session 1 Exam: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్ లోడ్ చేసిన ఫొటోల్లో తేడాలను ఎన్టీఏ గుర్తించింది. వాటిని మార్చుకునే వీలు కల్పించడానికి అధికారిక వెబ్ సైట్ లో ఒక విండో ఓపెన్ చేసింది. ఇక్కడ విద్యార్థులు తమ ఫొటోలను మార్చి, సరైన ఫొటోలను అప్ లోడ్ చేయవచ్చు.
ఈ రోజు నుంచి..
ఈ విండో జనవరి 16న ప్రారంభమయింది. ఈ విండో 2025 జనవరి 17న ముగుస్తుంది. సెషన్ 1 పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ (jee) అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా తమ ఫొటోలను మార్చుకోవచ్చు. కొందరు అభ్యర్థులు అప్ లోడ్ చేసిన ఫొటో నిర్ధారించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా లేదని గుర్తించిన ఏజెన్సీ ఆ చిత్రాలను సరిదిద్దేందుకు విండోను తెరవాలని నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు ఆల్రెడీ సమాచారం ఇచ్చిన ఎన్టీఏ
జేఈఈ మెయిన్ 2025 (JEE Main 2025 Session 1 Exam) సెషన్ 1 కు ఫొటోలు మార్చాల్సిన అవసరం ఉన్న అభ్యర్థులందరికీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి మెసేజ్, మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించామని ఎన్టీఏ తెలిపింది. ఆ అభ్యర్థులు ఈ క్రింద పేర్కొన్న ఏజెన్సీ నిర్దేశించిన స్పెసిఫికేషన్ల ప్రకారం మార్పులు చేయాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలను అనుగుణంగా
1. పాస్పోర్ట్ సైజు ఫొటో 10 కేబీ నుంచి 300 కేబీ మధ్య ఉండాలి.
2. లేటెస్ట్ గా దిగిన ఫొటో అయి ఉండాలి. అది తెలుపు బ్యాక్ గ్రౌండ్ లో చెవులతో సహా 80% ముఖం (మాస్క్ లేకుండా) కనిపించేలా ఉండాలి.
3. ఫొటో జేపీజీ/జేపీఈజీ ఫార్మాట్లో (స్పష్టంగా అర్థమయ్యేలా) పేర్కొనాలి.
4. క్రమం తప్పకుండా వాడితేనే కళ్లద్దాలకు అనుమతి ఉంటుంది.
5. పోలరాయిడ్, కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోలు ఆమోదయోగ్యం కాదు.
6. ఈ సూచనలను పాటించని లేదా అస్పష్టమైన ఛాయాచిత్రాలతో ఉన్న దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది.
7. పైన ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం ఫొటోలు లేని దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.
8. ఫోటోలను ధృవీకరించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు వైట్ బ్యాక్గ్రౌండ్ తో 6 నుంచి 8 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలను ఉంచుకోవాలి.
9. అప్లోడ్ చేసిన ఫొటోలు ఫ్యాబ్రికేటెడ్ అని తేలితే లేదా చేతితో తయారు చేసినవి లేదా కంప్యూటర్ తయారు చేసినట్లు అనిపిస్తే, అభ్యర్థి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని, దానిని అన్యాయమైన పద్ధతులను ఉపయోగించినట్లుగా పరిగణించి, తదనుగుణంగా అభ్యర్థిని డీల్ చేస్తామని అభ్యర్థులు గమనించాలి.
10. అభ్యర్థులు పైన పేర్కొన్న వాటిని గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.