JEE Main 2025: ఈ రాత్రి వరకే జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఇమేజ్ కరెక్షన్ విండో ఓపెన్; ఈ నిబంధనలు చూడండి..
JEE Main 2025: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న కొందరు విద్యార్థుల ఫొటోలు స్పెసిఫికేషన్లకు అనుగుణంగా లేవని ఎన్టీఏ గుర్తించింది. అలా ఉన్న ఫొటోలు అప్ లోడ్ చేసిన వారికి సరైన ఫొటోలను అప్ లోడ్ చేయడానికి అవకాశం కల్పించింది. ఆ ఇమేజ్ కరెక్షన్ విండో నేటి రాత్రి వరకే ఓపెన్ గా ఉంటుంది.
JEE Main 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (nta) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ సెషన్ 1 కోసం ఇమేజ్ కరెక్షన్ విండోను జనవరి 17 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతుంది. సరైన స్పెసిఫికేషన్లతో తమ ఫొటోలను అప్ లోడ్ చేయని విద్యార్థులు తమ సరైన ఫొటోలను జనవరి 17 అర్ధరాత్రి లోపు తిరిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ రాత్రి వరకే చాన్స్
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షకు దరఖాస్తులో సరైన స్పెసిఫికేషన్లతో తమ ఫొటోలను అప్ లోడ్ చేయని విద్యార్థులు జేఈఈ మెయిన్ 2025 అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ద్వారా సరైన ఫొటోలను అప్ లోడ్ చేయాలి. కొంతమంది అభ్యర్థుల ఫొటోలు అవసరమైన స్పెసిఫికేషన్ల ప్రకారం లేవని గమనించిన ఎన్టీఏ ఈ విండోను తెరిచింది. ఈ విషయాన్ని సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేశారు. అలాంటి అభ్యర్థులు వారి దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే, సరైన స్పెసిఫికేషన్లతో మళ్లీ ఫొటోను అప్ లోడ్ చేయాలి.
ఫొటో అప్ లోడ్ చేయడానికి ఈ స్పెసిఫికేషన్లను పాటించండి
- ఫొటో పరిమాణం 10 కేబీ నుంచి 300 కేబీ మధ్య ఉండాలి.
- మాస్క్ లేకుండా, తెలుపు బ్యాక్గ్రౌండ్ లో తీసిన కలర్ ఫొటో అయి ఉండాలి.
- ఫోటోలో చెవులతో సహా 80 శాతం ముఖాన్ని చూపించాలి.
- ఫోటోగ్రాఫ్ కు 'ఫోటోగ్రాఫ్' అని పేరు పెట్టాలి మరియు JPG/JPEG ఫార్మాట్ లో ఉండాలి (స్పష్టంగా అర్థమయ్యేలా).
- కళ్లద్దాలను అభ్యర్థి క్రమం తప్పకుండా ఉపయోగిస్తేనే అనుమతిస్తారు.
- పోలరాయిడ్, కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోలను అంగీకరించరు.
- పోలరాయిడ్, కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోలు ఆమోదయోగ్యం కాదు.
- ఫోటోను అటెస్ట్ చేయకూడదు.
ఈ నంబర్ కు కాల్ చేయొచ్చు
ఈ ఆదేశాలను పాటించని విద్యార్థుల దరఖాస్తులను తిరస్కరిస్తామని ఎన్టీఏ హెచ్చరించింది. అభ్యర్థులు తర్వాతి దశల్లో ఉపయోగించడానికి వీలుగా ఆరు నుంచి ఎనిమిది పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలను తమవద్ద ఉంచుకోవాలని సూచించారు. అప్ లోడ్ చేసిన ఫొటోలు ఫ్యాబ్రికేటెడ్ గా లేదా హ్యాండ్ మేడ్ లేదా కంప్యూటర్ తో తయారైనవిగా కనిపిస్తే అభ్యర్థి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని, దానిని అన్యాయమైన పద్ధతులను ఉపయోగించినట్లుగా పరిగణిస్తామని, తదనుగుణంగా అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ (NTA) తెలిపింది. ఏవైనా సందేహాలు, సందేహాలకు ఎన్టీఏ హెల్ప్ డెస్క్ నంబర్ 011-40759000/ 011-6922770కు కాల్ చేయవచ్చు లేదా jeemain@nta.nic.in కు లేఖ రాయవచ్చు.