JEE Main 2025: జేఈఈ మెయిన్ 2025 ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
JEE Main 2025: జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం తన వెబ్ సైట్ లో ప్రచురించింది. జనవరి 22 నుంచి 30 వరకు మొదటి సెషన్ ఉంటుందని, త్వరలోనే అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
JEE Main 2025: తన జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ కోసం ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం విడుదల చేసింది. వాటిని ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ జనవరి 22 నుంచి 30 వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలోనే అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో అప్ లోడ్ చేస్తామని ఎన్టీఏ తెలిపింది. ఆ తరువాత, అభ్యర్థులు సంబంధిత వివరాలను చెక్ చేసుకోవడంతో పాటు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
జనవరి 22 నుంచి..
జేఈఈ మెయిన్స్ పరీక్షను జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. సంబంధిత సంస్థలు అందించే బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునేవారికి మొదటి పేపర్ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులకు దరఖాస్తు చేసుకునేవారికి జనవరి 30న పేపర్-2 పరీక్ష రెండు భాగాలుగా జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 అడ్మిట్ కార్డు, ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పు వేరు వేరని ఎన్టీఏ తెలిపింది. అధికారిక వెబ్సైట్ ద్వారా పరీక్ష కేంద్రాల వివరాలను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్ ను, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులలో పరీక్ష కేంద్రం చిరునామా, పరీక్ష రోజు సూచనలు, పేపర్ సమయం, రిపోర్టింగ్ సమయం, ఇతర వివరాలు ఉంటాయి.
అడ్మిట్ కార్డులను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
జేఈఈ మెయిన్స్ 2025 (JEE Main 2025) మొదటి సెషన్ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన తరువాత. విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో 'జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 కోసం అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి' లింక్ ను సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేయండి.
- స్క్రీన్ పై కొత్త వెబ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత అవసరమైన వివరాలను నమోదు చేయండి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
- స్క్రీన్ పై కనిపించిన తర్వాత మీ జేఈఈ (jee) మెయిన్ 2025 అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.