ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ కాన్పూర్) జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలను జూన్ 2, 2025 సోమవారం(రేపు) విడుదల చేస్తుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2025 రాసిన అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ ఫలితాలను చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాల సందర్భంగా అభ్యర్థులు అలర్ట్ గా ఉండాలి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ 2025 విడుదలైన తర్వాత అభ్యర్థులు ముఖ్యమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఫలితాలు త్వరగా చూసుకోవచ్చు. ఈ కింది వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. అప్లికేషన్/రిజిస్ట్రేషన్ నెంబరు, జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డు, పాస్ వర్డ్.
ఫలితాల విడుదలకు ముందు జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని మే 25న విడుదల చేశారు. మే 27 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షను మే 18 ఆదివారం రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్ -1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ -2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 కోసం మొత్తం 187223 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐఐటీ ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. దీని రిజిస్ట్రేషన్లు జూన్ 3, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్లు, కటాఫ్ మార్కుల వివరాలను ఐఐటీ కాన్పూర్ ప్రకటించనుంది.
jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్ 2025 డౌన్లోడ్ చేసుకోవడానికి హోమ్ పేజీలో లింక్ మీద క్లిక్ చేయండి.
యాడ్ సబ్మిట్‌లో లాగిన్ అవ్వడానికి మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండి.
మీ జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్ 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
భవిష్యత్తు రిఫరెన్స్ కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ ఉంచండి.
జేఈఈ అడ్వాన్స్ డ్ అనేది ఐఐటీలు, మరికొన్ని సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు (అన్ని కేటగిరీలు కలిపి) ఈ ప్రవేశ పరీక్ష రాస్తారు.