ఐఐటీ కాన్పూర్ జేఈఈ అడ్వాన్స్డ్ హాల్ టికెట్ 2025ను మే 11న విడుదల చేయనుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ డ్ 2025కు హాజరయ్యేందుకు అర్హులైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.in నుంచి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు ను విద్యార్థులు మే 11, 2025 నుంచి మే 18, 2025 వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షను 2025 మే 18న నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షలో పేపర్ 1, 2 అనే రెండు పేపర్లు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు. విద్యార్థులు రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరు కావాలి.
అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రోల్ నంబర్, జేఈఈ మెయిన్ దరఖాస్తు నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, కరస్పాండెన్స్ చిరునామా, కేటగిరీ ఉంటాయి. అంతేకాకుండా అడ్మిట్ కార్డులో అభ్యర్థికి కేటాయించిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా ఉంటుంది. ఇవి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ హాల్ టికెట్ 2025 ను డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
1. ముందుగా జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్డ్ హాల్ టికెట్ 2025 లింక్ పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. వివరాలు నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది.
5. హాల్ టికెట్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్ డ్) 2025 (జేఈఈ (అడ్వాన్స్ డ్) 2025ను జాయింట్ అడ్మిషన్ బోర్డు 2025 (జేఏబీ 2025) మార్గదర్శకత్వంలో ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీలు నిర్వహించనున్నాయి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఐటీ జేఈఈ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.
సంబంధిత కథనం