మే 18న జరగనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు సంబంధించి జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ తాజా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ (jeeadv.ac.in.) నుంచి అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డు 2025 డౌన్లోడ్ చేసుకోవడానికి గడువు మే 18 మధ్యాహ్నం 2:30 గంటల వరకు అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఉంటాయి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షను మే 18న రెండు షిఫ్టుల్లో, పేపర్-1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ 2025లో ఉత్తీర్ణత సాధించి అడ్వాన్స్డ్ రౌంజ్రి రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డు 2025ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డు 2025 డౌన్లోడ్ చేసుకోవడానికి, విద్యార్థులు ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి..
దశ 1: జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డు ఉండే అధికారిక వెబ్సైట్, jeeadv.ac.in సందర్శించండి.
స్టెప్ 2: హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న "అడ్మిట్ కార్డ్" లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: క్యాండిడేట్ పోర్టల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 4: లాగిన్ విండోలో రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేయాలి.
స్టెప్ 4: 'లాగిన్'పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డును చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీని భవిష్యత్ రిఫరెన్స్ కోసం ఉంచుకోవాలి.
పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు అడ్మిట్ కార్డులో పేర్కొన్న రిపోర్టింగ్ సమయం కంటే ముందుగానే, తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటి అభ్యంతరకర వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లరాదని, అనుచిత పద్ధతులకు పాల్పడవద్దని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ 2025 అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం