ITBP Recruitment 2025: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP)లో స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2025 ఏప్రిల్ 2. ఐటీబీపీ అధికారిక వెబ్సైట్ లో ఉన్న సవివరమైన నోటిఫికేషన్ లో ఇచ్చిన పేరా-4(డి) ప్రకారం పతకాలు సాధించిన/ పొజిషన్ హోల్డర్లు/ లేదా పాల్గొనే ప్రతిభావంతులైన క్రీడాకారులకు మాత్రమే ఈ నియామకం జరుగుతుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిని నిర్ణయించడానికి కటాఫ్ తేదీ 03/04/2025.
నోటిఫికేషన్ లో ఇచ్చిన పోటీల్లో పాల్గొన్న లేదా పతకాలు సాధించిన క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పొందిన అభ్యర్థులకు ఆన్లైన్ అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. ఆ వివరాలు త్వరలోనే అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.
యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100/-. మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.
సంబంధిత కథనం