ISRO YUVIKA : భావి శాస్త్రవేత్తలకు బెస్ట్​ ఛాన్స్​ ఇది- ఇస్రో 'యువిక'పై కీలక అప్డేట్​..-isro yuvika 2025 registration for young scientist programme ends today ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Isro Yuvika : భావి శాస్త్రవేత్తలకు బెస్ట్​ ఛాన్స్​ ఇది- ఇస్రో 'యువిక'పై కీలక అప్డేట్​..

ISRO YUVIKA : భావి శాస్త్రవేత్తలకు బెస్ట్​ ఛాన్స్​ ఇది- ఇస్రో 'యువిక'పై కీలక అప్డేట్​..

Sharath Chitturi HT Telugu

ISRO YUVIKA 2025 Registration : ఇస్రో యువిక 2025పై కీలక అప్డేట్​. భావి శాస్త్రవేత్తల కోసం ఇస్రో చేపట్టిన ఈ ప్రత్యేక ప్రోగ్రామ్​ రిజిస్ట్రేషన్​ డేట్​ నేడు ముగియనుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇస్రో యువికపై కీలక అప్డేట్​.. (Unsplash/For representation )

పాఠశాల విద్యార్థుల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘యువిక’పై కీలక అప్డేట్​. ఇస్రో యువిక 2025 రిజిస్ట్రేషన్ విండో మార్చ్​ 23తో ముగియనుంది. విద్యార్థులు/ తల్లిదండ్రులు ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం అధికారిక వెబ్సైట్​ (jigyasa.iirs.gov.in.) లోదరఖాస్తు చేసుకోవచ్చు.

యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ "యువిజ్ఞాని కార్యక్రం" లేదా యువిక అనేది యువ విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్రం, అంతరిక్ష యాప్స్​పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి ఇస్రో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం.

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) ఆధారిత రీసెర్చ్/కెరీర్​లో మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రామ్ దోహదపడుతుంది.

భారతదేశంలో 2025 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్​కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7న తొలి ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు మే 19లోగా లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్​లో తెలియజేసిన తేదీలోగా సంబంధిత ఇస్రో కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ కార్యక్రమం మే 19న ప్రారంభమై మే 30న ముగుస్తుంది.

ఇస్రో యువిక 2025: దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి. (ముందుగా రిజిస్టర్ బటన్​పై క్లిక్ చేసి, ప్రక్రియను పూర్తి చేసి, ఆపై మీ ఖాతాలోకి లాగిన్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపండి).

ఈ ప్రోగ్రామ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.

అభ్యర్థుల ఎంపిక కింది పారామీటర్ల ఆధారంగా జరుగుతుంది

8వ తరగతి పరీక్షలో సాధించిన మార్కులు- 50 శాతం వెయిటేజీ

ఆన్​లైన్ క్విజ్​లో పర్ఫార్మెన్స్​: 10శాతం వెయిటేజ్​

సైన్స్ ఫెయిర్​ (గత 3 సంవత్సరాల్లో పాఠశాల/ జిల్లా/ రాష్ట్రం అంతకంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనడం) - 2/5/10 శాతం వెయిటేజీ

ఒలింపియాడ్ లేదా తత్సమాన స్థాయి ర్యాంక్ (గత 3 సంవత్సరాల్లో పాఠశాల/ జిల్లా/ రాష్ట్రంలో 1 నుంచి 3 ర్యాంకు, అంతకంటే ఎక్కువ స్థాయి): 2/4/5 శాతం వెయిటేజీ

క్రీడా పోటీల విజేతలు (గత 3 సంవత్సరాల్లో పాఠశాల/జిల్లా/రాష్ట్ర స్థాయిలో 1 నుంచి 3 ర్యాంకులు): 2/4/5 శాతం వెయిటేజీ

గత మూడేళ్లలో స్కౌట్ అండ్ గైడ్స్/ఎన్​సీసీ/ఎన్​ఎస్​ఎస్ సభ్యులు: 5 శాతం వెయిటేజీ

పంచాయతీ ప్రాంతాల్లోని గ్రామ/గ్రామీణ పాఠశాలల్లో చదువు: 15 శాతం వెయిటేజీ.

ఏడు కేంద్రాల్లో ప్రతి రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీస భాగస్వామ్యం ఉండేలా ఇస్రో చూసుకుంటుంది.

డెహ్రాడూన్​లోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్).

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ), తిరువనంతపురం.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ).

యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ (యు.ఆర్.ఎస్.సి), బెంగళూరు.

స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ), అహ్మదాబాద్.

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), హైదరాబాద్.

నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్ఈ-ఎస్ఏసీ), షిల్లాంగ్.

ఎంపిక చేసిన విద్యార్థుల ప్రయాణ ఖర్చులు (సమీపంలోని రైల్వే స్టేషన్ లేదా బస్ టెర్మినల్ నుంచి సెకండ్ ఎసీ రైలు లేదా ఎసీ బస్సు ఛార్జీలు) రీయింబర్స్ చేస్తామని ఇస్రో తెలిపింది.

ప్రయాణ ఛార్జీల రీయింబర్స్​మెంట్ కోసం విద్యార్థులు ఒరిజినల్ ట్రావెల్ టికెట్లను చూపించాల్సి ఉంటుంది.

కోర్సు మెటీరియల్, వసతి, భోజన సదుపాయం తదితర అంశాలను ఇస్రో భరిస్తుంది.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం