మంచి జీతంతో ఇస్రోలో నియామకాలు.. ఈ పోస్టులకు జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోండి-isro recruitment 2025 various posts with good salary last date to apply 18th june ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  మంచి జీతంతో ఇస్రోలో నియామకాలు.. ఈ పోస్టులకు జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోండి

మంచి జీతంతో ఇస్రోలో నియామకాలు.. ఈ పోస్టులకు జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోండి

Anand Sai HT Telugu

ఇస్రోలో చాలా ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..

ఇస్రోలో ఉద్యోగాలు

సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి కలిగి ఉండి.. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తే మీ కోసం మంచి ఛాన్స్ ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌లను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు 18 జూన్ 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in లేదా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సైట్ vssc.gov.in ని సందర్శించడం ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టులు

టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 27 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్): 27 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్): 12 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ (కెమికల్): 8 పోస్టులు. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్, ఆటోమొబైల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ): 4 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ): 5 పోస్టులు, లైబ్రరీ అసిస్టెంట్-ఏ: 2 పోస్టులు.

ప్రతి పోస్టుకు వేర్వేరు విద్యా అర్హతలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధిత రంగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా కలిగి ఉండాలి. అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ కోసం, ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ అవసరం. లైబ్రరీ అసిస్టెంట్ కోసం లైబ్రరీ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ కావాలి.

జీతం, ఎంపిక విధానం

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు జీతం లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా వారు ప్రభుత్వ అలవెన్సులు, పదోన్నతి ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

రాత పరీక్షలో 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వీటిని 90 నిమిషాల్లో పరిష్కరిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కులు తీసివేస్తారు. నైపుణ్య పరీక్షలో అభ్యర్థి ఆచరణాత్మక జ్ఞానాన్ని పరీక్షిస్తారు.

ఎలా అప్లై చేయాలి?

అభ్యర్థులు మెుదట vssc.gov.in అధికారిక సైట్‌ను సందర్శించండి.

హోమ్‌పేజీలో “VSSC రిక్రూట్‌మెంట్ ప్రకటన ఆర్ఎంటీ 335: దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. లింక్‌పై క్లిక్ చేయండి.

కొత్త పేజీ తెరుచుకుంటుంది. అందులో మొబైల్ నంబర్, ఇమెయిల్ ద్వారా నమోదు చేసుకోవాలి.

దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

రుసుము చెల్లించిన తర్వాత, ఫారమ్‌ను సమర్పించి, కన్ఫామ్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.