IOCL Recruitment 2025: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
IOCL Recruitment 2025: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పలు పోస్ట్ ల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్ట్ ల్లో జూనియర్ ఆపరేటర్, తదితర పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ https://iocl.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

IOCL Recruitment 2025: జూనియర్ ఆపరేటర్, ఇతర పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ https://iocl.com/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 246 పోస్టులను భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 ఫిబ్రవరి 23న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
ఖాళీల వివరాలు
1. జూనియర్ ఆపరేటర్: 215 పోస్టులు
2. జూనియర్ అటెండెంట్: 23 పోస్టులు
3. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్: 8 పోస్టులు
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితిని డీటెయిల్డ్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం
1. ముందుగా ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. అక్కడ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
5. ఆ తరువాత, సబ్మిట్ పై క్లిక్ చేసి అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
6. అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
7. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
8. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.