IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
IOCL Recruitment: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పాటు వికలాంగుల స్పెషల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
IOCL Recruitment: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన మార్కెటింగ్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేడ్ 1 ఉద్యోగాలతో పాటు వికలాంగుల స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో గ్రేడ్ 3 పోస్టులను కూడా భర్తీ చేస్తారు. దేశీయ చమురు సంస్థ ఐఓసీఎల్.. ఆయిల్, గ్యాస్, పెట్రో కెమికల్స్ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో మహారత్న హోదాతో నడుస్తున్న ప్రభుత్వ చమురు సంస్థగా గుర్తింపు పొందింది. దేశీయ ఇంధన అవసరాలను తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ విభాగాలు, కార్యాలయాల్లోని మార్కెటింగ్ విభాగంలో గ్రేడ్ 1 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింద.
పే స్కేల్ గ్రేడ్ 1 విభాగంలో జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలు 215, గ్రేడ్1 జూనియర్ అటెండెంట్ పోస్టులు 23, గ్రేడ్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. వీటిలో జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యగాలను నిర్దేశిత ప్రమాణాల మేరకు శారీరక వైకల్యం ఉన్న వారి కోసం కేటాయించారు.
గ్రేడ్ 1 ఉద్యోగాలకు పే స్కేల్ రూ.23వేలు-78వేలుగా ఉండగా,గ్రేడ్ 3 ఉద్యోగాలకు రూ.25వేలు-1.05లక్షల పే స్కేల్ ఉంది.
ఎంపికైన వారికి వేతన పే స్కేల్ ప్రకారం బేసిక్‌తో పాటు డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఎల్‌టిఏ, సూపర్ యాన్యుయేషన్ వంటి ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాలు అందుతాయి.
దరఖాస్తు ఇలా...
ఐఓసీ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఐఓసీ వెబ్‌సైట్ లో ఉంటుంది. రిజర్వేషన్, విద్యార్హతలు, ఎంపిక విధానం, ఇతర ముఖ్య సూచనలు, అర్హతల వివరాల కోసం ఈ లింకును అనుసరించండి.
ఆన్‌లైన్ దరఖాస్తు చేయడనాకి ఐఓసీ వెబ్ సైట్‌లోకి వెళ్లి కెరీర్స్ విభాగంలో లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్‌లో నోటిఫికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభం అవుతాయి. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి ఫిబ్రవరి 23వ తేదీ వరకు గడువు ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారు.
సీబీటీ పరీక్ష ఫలితాలను ఏప్రిల్, మేనెలల్లో విడుదల చేస్తారు.తుది విడత ఎంపిక పరీక్షకు ఎంపికైన వారి షార్ట్ లిస్ట్‌లను ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెలలో విడుదల చేస్తారు.
ఐఓసీ నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి.
https://iocl.com/admin/img/UploadedFiles/LatestJobOpening/Files/613feac7e44444bb91a7d6b610014b16.pdf
ఐఓసీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును క్లిక్ చేయండి. https://ibpsonline.ibps.in/iocljan25/