Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్.. అర్హతలు, ఖాళీల వివరాలు తెలుసుకోండి-indian navy ssc officer recruitment know qualification and posts details here download notification pdf ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్.. అర్హతలు, ఖాళీల వివరాలు తెలుసుకోండి

Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్.. అర్హతలు, ఖాళీల వివరాలు తెలుసుకోండి

Anand Sai HT Telugu Published Feb 11, 2025 10:53 AM IST
Anand Sai HT Telugu
Published Feb 11, 2025 10:53 AM IST

Indian Navy Recruitment : ఇండియన్ నేవీ కొత్త రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలేంటో చూడండి..

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ (Unsplash)

ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు భారత నావికాదళ అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in లో ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు నిర్దేశించిన చివరి తేదీకి ముందు ఫారమ్‌ను దరఖాస్తు చేసుకోవచ్చు. నేవీ ఆఫీసర్ కావడానికి అవసరమైన అర్హతలు ఏమిటి? చూద్దాం..

ఇండియన్ నేవీలో చేరాలని కలలు కంటున్న అభ్యర్థుల కోసం కొత్త రిక్రూట్‌మెంట్ వచ్చింది. ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) జనవరి 2026 (ST 26 కోర్సు) కింద ఆఫీసర్ స్థాయి ఖాళీలను విడుదల చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8 నుండి ప్రారంభమైంది. దీనిలో అర్హత గల అభ్యర్థులు 25 ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

భారత నావికాదళం ఈ నియామకాలు టెక్నికల్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లలో విడుదల చేసింది. ఏ బ్రాంచ్/కేడర్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం..

ఖాళీల వివరాలు

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (GS(X)/హైడ్రో కేడర్) 60, పైలట్ 26, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ (అబ్జర్వర్స్) 22, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) 18, లాజిస్టిక్స్ 28, ఎడ్యుకేషన్ బ్రాంచ్ 15, ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్(GS) 38, ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ (GS) 45, నావల్ కన్స్ట్రక్టర్ 18 పోస్టులు ఉన్నాయి. మెుత్తం 270 ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది.

అర్హతలు

నేవీ ప్రభుత్వ ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో పోస్ట్ ప్రకారం BE/BTech డిగ్రీ, MBA/BSc/B.Com/MCA/MSc మొదలైన డిగ్రీని కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియలో భాగంగా అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల తర్వాత షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి. ఎందుకంటే ఒకసారి ఫారమ్ నింపిన తర్వాత దానిలో ఎటువంటి మార్పులు చేయలేరు.

Whats_app_banner