మీరు పాడటం, వాయించడం ఇష్టపడితే.. దేశానికి సేవ చేయాలనుకుంటే మీకు గొప్ప అవకాశం వచ్చింది, ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంఆర్ మ్యూజిషియన్ రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. ఈ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ధరఖాస్తు ఫారమ్‌లు ఇంకా ప్రారంభం కాలేదు.
ఈ నేవీ నియామకానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన పాఠశాల విద్య బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అవివాహిత మహిళా, అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ నియామకంలో పాల్గొనగలరు. అభ్యర్థులు నమోదు కోసం అవివాహితులు అనే సర్టిఫికేట్‌ను కూడా సమర్పించాలి. అదే సమయంలో అగ్నివీర్‌లు భారత నేవీలో నాలుగు సంవత్సరాల పదవీకాలంలో వివాహం చేసుకోవడానికి అనుమతిలేదు.
విద్యార్హతతో పాటు అభ్యర్థులకు సంగీత నైపుణ్యం, సామర్థ్యం ఉండాలి. ఇందులో లయ, శ్రావ్యత, పూర్తి పాట పాడటానికి కచ్చితత్వం ఉండాలి. అభ్యర్థులు భారతీయ లేదా విదేశీ మూలానికి చెందిన ఏదైనా వాయిద్యంపై నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు కీబోర్డ్/స్ట్రింగ్/వింగ్ వాయిద్యాలు/డ్రమ్ కిట్ లేదా భారతీయ/విదేశీ మూలానికి చెందిన ఏదైనా వాయిద్యంలో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ వివరంగా తనిఖీ చేయాలి.
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2004 నుండి ఫిబ్రవరి 29, 2008 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థులకు నెలకు రూ. 30000 జీతం లభిస్తుంది. ఇది ఏటా అప్డేట్ అవుతుంది. ఈ నియామకానికి దరఖాస్తులు జూలై 5 నుండి నేవీ అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.inలో ప్రారంభమవుతాయి. చివరి తేదీ జూలై 13, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. దీని తర్వాత శారీరక దృఢత్వ పరీక్ష, సంగీత సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ కేటగిరీ అభ్యర్థులైనా దరఖాస్తు కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా ఫారమ్ నింపవచ్చు.