ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో చేరడానికి ఒక మంచి వచ్చింది. కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ బ్యాచ్ 2027 కోసం నియామక ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు 8 జూలై 2025 నుండి 23 జూలై 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీకీ సంబంధించి 140 పోస్టులు, టెక్నికల్‌కు సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి.
జనరల్ డ్యూటీ, టెక్నికల్ బ్రాంచ్ కోసం ఈ రిక్రూట్‌మెంట్ విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులు joinindiancoastguard.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్ డ్యూటీ(జీడీ)కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, మీరు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అదే సమయంలో, టెక్నికల్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. రెండు బ్రాంచ్‌లలోనూ నియామకాలకు, విద్యార్హత భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థల నుండి ఉండాలి.
ఈ నియామకంలో చేరడానికి మీ వయస్సు జూలై 1, 2026 నాటికి 21 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే మీరు జూలై 1, 2001 మరియు జూన్ 30, 2005 మధ్య జన్మించి ఉండాలి. గతంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేదా కోస్ట్ గార్డ్‌లో పనిచేసి ఉంటే, మీకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఇస్తారు.
జనరల్, ఓబీసీ, అన్ని ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 300 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఫీజును ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లిస్తారు.
అభ్యర్థులు మెుదట joinindiancoastguard.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి .
హోమ్‌పేజీలో CGCAT 2027 బ్యాచ్‌పై క్లిక్ చేయండి.
“వార్తలు/ప్రకటనలు” విభాగానికి వెళ్లి, అప్లికేషన్ లింక్‌ను తెరవండి.
కొత్త ఖాతాను క్రియేట్ చేయడానికి, నమోదు చేసుకుని అవసరమైన సమాచారాన్ని నింపండి.
రిజిస్ట్రేషన్ తర్వాత, లాగిన్ అయి మీ పూర్తి దరఖాస్తు ఫారమ్ నింపండి.
చివరగా దరఖాస్తు రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించండి.