గ్రామీణ్ డాక్ సేవక్ 2025 ఆన్లైన్ ఎంగేజ్మెంట్ కోసం ఇండియా పోస్ట్ మూడొవ మెరిట్ లిస్ట్‌ని తాజాగా విడుదల చేసింది. గ్రామీణ్ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ 2025 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లో (indiapostgdsonline.gov.in.) ఈ 3వ మెరిట్ లిస్ట్‌ని చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌కి సంబంధించిన రాష్ట్రాలకు ఈ 3వ మెరిట్ లిస్ట్ అందుబాటులో ఉంది.
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2025 3వ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు మెరిట్ లిస్ట్‌లో పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా తమ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇందుకు జూన్ 3, 2025 వరకు గడువు ఉంది.
ఒరిజినల్స్, రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీలతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ తెలిపింది.
ఈ దఫా ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా 21,413 వేకెన్సీలను భర్తీ చేస్తున్నారు. వివిధ సర్కిల్స్ వారీగా, రాష్ట్రాల వారీగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది.
ఇండియా పోస్ట్ జీడీఎస్ సెలక్షన్లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. 10వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, ఉద్యోగంలో చేరే ముందు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక్కటే చివరి స్టెప్.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
సంబంధిత కథనం