Postal GDS Recruitment : ఇండియా పోస్టులో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 21,413 గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుల భర్తీ చేయనున్నారు. ఏపీలో 1215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి. పదో తరగతి అర్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి.
పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 3 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ్ డాక్ సేవక్ కింద బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులను నియమించనున్నారు.
అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో మొబైల్ నంబర్, యాక్టివ్ ఇ-మెయిల్ ఐడీ అవసరం. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ఒక అభ్యర్థికి ఒకే రిజిస్ట్రేషన్ మాత్రమే ఉండాలి. దరఖాస్తు ఫారమ్‌తో ఏ పత్రాలను జతచేయవలసిన అవసరం లేదు. అభ్యర్థి ఇటీవలి ఫోటోగ్రాఫ్, సంతకాన్ని పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
జీడీఎస్ పోస్టులు కేంద్ర ప్రభుత్వం/ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు కారు. వీరి జీతాలు, అలవెన్సులు, ఇతర అర్హతలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండవని దరఖాస్తుదారులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
సంబంధిత కథనం