IIT students placement: ఐఐటీ విద్యార్థికి రూ.4.3 కోట్ల జాబ్ ఆఫర్; ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే హైయెస్ట్
IIT placements: ఐఐటీలు సహా ప్రముఖ విద్యాసంస్థల్లో ప్లేస్ మెంట్ సీజన్ ప్రారంభమైంది. అంతర్జాతీయంగా కొంత మందగమనం కనిపిస్తున్నప్పటికీ, కొందరు ఐఐటీ విద్యార్థులు భారీ ప్యాకేజ్ లతో జాబ్ ఆఫర్స్ పొందారు. వారిలో ఇప్పటివరకు ఒక ఐఐటీ విద్యార్థికి గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ నుంచి రూ.4.3 కోట్ల జాబ్ ఆఫర్ వచ్చింది.
IIT students placements: దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో ప్లేస్మెంట్స్ ప్రారంభమయ్యాయి. వాటిలో ఐఐటీ ఢిల్లీ, బాంబే, మద్రాస్, కాన్పూర్, రూర్కీ, ఖరగ్పూర్, గౌహతి, బీహెచ్ యూ తదితర విద్యా సంస్థలున్నాయి.
రూ .4.3 కోట్ల భారీ ప్యాకేజ్
ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ లో ఒక 2025 బ్యాచ్ ఐఐటీ విద్యార్థికి ఇప్పటివరకు అత్యధికంగా రూ. 4.3 కోట్ల భారీ ప్యాకేజ్ తో జాబ్ ఆఫర్ వచ్చింది. హాంకాంగ్ కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ ఐఐటి మద్రాస్ లో (IIT placements) కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి ఈ భారీ ఆఫర్ ఇచ్చింది. ఈ ప్యాకేజ్ లో బేస్ శాలరీతో పాటు, ఫిక్స్డ్ బోనస్, రిఅలొకేషన్.. తదితర అలవెన్స్ లు కూడా ఉన్నాయి. ఆ విద్యార్థితో పాటు ఐఐటీ మద్రాస్ లోని పలువురు విద్యార్థులు పలు అంతర్జాతీయ విద్యా సంస్థల్లో మంచి ప్లేస్ మెంట్స్ పొందారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ గౌహతి, బీహెచ్యూ విద్యాసంస్థల్లోని విద్యార్థులు కూడా ఆకర్షణీయమైన వేతనాలతో ప్లేస్ మెంట్స్ పొందారు.
ఐఐటీలన్నింటిలో ఇప్పటివరకు వచ్చిన బిగ్ టికెట్ ఆఫర్స్ ఇవే..
- బ్లాక్ రాక్, గ్లెన్, డావిన్సీ ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ.2 కోట్లు.
- ఏపీటీ పోర్ట్ ఫోలియో, రూబ్రిక్ ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ.1.4 కోట్లు.
- డాటాబ్రిక్స్, ఎబులియెంట్ సెక్యూరిటీస్, ఐఎంసీ ట్రేడింగ్ ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ.1.3 కోట్లు.
- క్వాడ్ ఐ ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ. 1 కోటి.
- క్వాంట్ బాక్స్, గ్రావిటన్ ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ.90 లక్షలు.
- డీఈ షా ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ.66 నుంచి రూ.70 లక్షలు.
- పేస్ స్టాక్ బ్రోకింగ్ ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ.75 లక్షలు.
- స్క్వేర్ పాయింట్ క్యాపిటల్ ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ.66 లక్షలు.
- మైక్రోసాఫ్ట్ ఇచ్చిన అత్యధిక ఆఫర్ రూ.50 లక్షలు.
వివిధ ఐఐటీలకు మొదటి రోజు వచ్చిన రిక్రూటర్లలో కొందరు
- క్వాల్ కామ్
- Microsoft
- గోల్డ్ మన్ శాక్స్
- బజాజ్ ఆటో
- ఓలా ఎలక్ట్రిక్
- Alphonso
- Nutanix
ఇవన్నీ గత ఏడాదితో పోలిస్తే మరింత ఉత్సాహభరితమైన ప్లేస్ మెంట్ల (jobs) సీజన్ ను సూచిస్తున్నాయని, మొదటి రోజు బిగ్ టికెట్ ఆఫర్లు కూడా ప్లేస్ మెంట్స్ సీజన్ ముగిసే సమయానికి మొత్తంగా ఉద్యోగాలు పొందే విద్యార్థుల సంఖ్యకు ప్రతిబింబం కాకపోవచ్చునని నివేదిక తెలిపింది.