IIT Kanpur Recruitment : ఐఐటీ కాన్పూర్ రిక్రూట్‌మెంట్.. మంచి జీతం, ఇలా దరఖాస్తు చేసుకోండి!
IIT Kanpur Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ రిక్రూట్‌మెంట్ వెలువడింది. గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బ్రాంచ్‌ల కింద వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్ట్స్, ఇతర రంగాలకు సంబంధించినది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయాలి. చివరి తేదీ 31 జనవరి 2025 వరకు ఉంది. అభ్యర్థులు IIT కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ www.iitk.ac.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థి గ్రాడ్యుయేషన్, MCA, MSc, B.Tech, BE, హోటల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంఫిల్ లేదా సంబంధిత విభాగంలో ఇతర మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. దీనితో పాటు పోస్ట్ ప్రకారం వయోపరిమితి కూడా ఉంటుంది. కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 57 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఇస్తారు.
గ్రూప్ A పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 1000 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 500 చెల్లించొచ్చు. కేటగిరీతో సంబంధం లేకుండా మహిళా అభ్యర్థులందరికీ ఎలాంటి రుసుము చెల్లించకుండా మినహాయింపు ఉంది.
గ్రూప్ B, C పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తప్పనిసరిగా రూ.700 రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 350గా ఫీజు ఉంది. మహిళా అభ్యర్థులు కేటగిరీతో సంబంధం లేకుండా రుసుము లేదు.
పోస్టులు
సీనియర్ సూపరింటెండింగ్ ఇంజనీర్
సూపరింటెండింగ్ ఇంజనీర్
డిప్యూటీ రిజిస్ట్రార్
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
అసిస్టెంట్ కౌన్సెలర్
అసిస్టెంట్ రిజిస్ట్రార్
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లైబ్రరీ)
హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్
మెడికల్ ఆఫీసర్
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (మహిళలకు మాత్రమే)
అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్
జూనియర్ అసిస్టెంట్
ఎంపిక విధానం రాత పరీక్ష లేదా నిపుణుల ప్యానెల్‌కు సెమినార్ ఉండొచ్చు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్టులను బట్టి వివిధ రకాలుగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ చదవండి. వివిధ పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులు రూ. 21,700 నుండి రూ. 2,16,600 వరకు జీతం పొందుతారు.
దరఖాస్తు విధానం
దరఖాస్తు చేయడానికి ముందుగా ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్ iitk.ac.inకి వెళ్లండి. రిక్రూట్‌మెంట్ విభాగానికి వెళ్లి 'ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి' లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు రిజిస్టర్ న్యూ యూజర్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలను నమోదు చేసుకోవాలి. తర్వాత, లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. కేటగిరీ ప్రకారం నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించండి. తర్వాత ఫారమ్‌ను సమర్పించి, దాని ప్రింట్‌అవుట్‌ని తీసుకొవాలి.