IIT Hyderabad Recruitment 2025 : ఐఐటీ హైదరాబాద్లో ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తులకు కొన్ని గంటలే గడువు!
IIT Hyderabad Recruitment 2025 : ఐఐటీ హైదరాబాద్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు ఒకటి మాత్రమే ఉంది. ఈ పోస్టుకు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తాత్కాలిక పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. 11 నెలల పని చేయాల్సి ఉంటుంది. పని తీరు ఆధారంగా మరో ఏడాది పొడిగించవచ్చు. 30 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హతలతో పాటు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్యూతో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి రూ. 28 వేల జీతం చెల్లిస్తారు ఏమైనా సందేహాలు ఉంటే office@des.iith.ac.in మెయిల్ చేయవచ్చు. గూగుల్ ఫామ్ నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు…
మరో నోటిఫికేషన్ కింద ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టును రిక్రూట్ చేయనున్నారు. ఒక్క పోస్టు మాత్రమే ఉంది. విజువల్ కమ్యూనికేషన్, డిజైన్ ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ , ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మూడేళ్లపాటు పని చేసిన అనుభవం కూడా ఉండాలి. 40 ఏళ్ల లోపు ఉన్న అప్లికేషన్ చేసుకోవచ్చు.
గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల జీతం చెల్లిస్తారు. అర్హులైన వారు ఫిబ్రవరి 15వ తేదీలోపు దఱాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఏమైనా సందేహాలు ఉంటే office@des.iith.ac.in మెయిల్ చేయవచ్చు.
మరికొన్ని ఖాళీలు - ఫిబ్రవరి 20 చివరి తేదీ:
ఐఐటీ హైదరాబాద్ లో మరికొన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రొగ్రామ్ మేనేజర్, సైంటిఫిక్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి.
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా ప్రోగ్రామ్ మేనేజర్, సైంటిఫిక్ ఆఫీసర్(సైబర్ సెక్యూరిటీ), సైంటిఫిక్ ఆఫీసర్(ఎంల్ అండ్ హెచ్పీసీ), ప్రీడాక్స్, ఇంటర్న్స్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ ఖాళీలన్నీ కూడా తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన వారు ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్ వెబ్ సైట్ లోకి వెళ్లి నోటిఫికేషన్ వివరాలతో పాటు గూగుల్ ఫామ్ లింక్ కూడా పొందవచ్చు.
సంబంధిత కథనం