IIT Hyderabad Recruitment 2025 : ఐఐటీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - మంచి జీతం, ఇవిగో వివరాలు
IIT Hyderabad Recruitment 2025: ఐఐటీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఐదు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా ప్రొగ్రామ్ మేనేజర్, సైంటిఫిక్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు :
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా ప్రోగ్రామ్ మేనేజర్, సైంటిఫిక్ ఆఫీసర్(సైబర్ సెక్యూరిటీ), సైంటిఫిక్ ఆఫీసర్(ఎంల్ అండ్ హెచ్‌పీసీ), ప్రీడాక్స్, ఇంటర్న్స్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ ఖాళీలన్నీ కూడా తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
- ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు ఎంబీఏ పాసై ఉండాలి. కనీసం మూడేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల నుంచి రూ. 1 లక్ష వరకు జీతం చెల్లిస్తారు.
- సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ ఉండాలి. సంబంధిత రంగంలో నాలుగేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు జీతం ఉంటుంది.
- సైంటిఫిక్ ఆఫీసర్ (ML and HPC) పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా మ్యాథ్స్ లేదా ఏఐ లేదా డేటా సైన్స్ లో డిగ్రీ ఉండాలి. పని చేసిన అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు జీతం ఉంటుంది.
- ప్రీడాక్స్ పోస్టుకు సీఎస్ఈ లేదా ఐటీ, ఈఈ, ఈసీఈ లేదా మ్యాథ్య్ లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంపికైన వారి నెలకు రూ. 40 వేల జీతం చెల్లిస్తారు.
- ఇంటర్న్స్ గా ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల జీతం చెల్లిస్తారు. సీఎస్ఈ లేదా ఐటీ, ఈఈ లేదా ఈసీఈ లేదా మ్యాథ్య్ లో డిగ్రీ ఉండాలి.
దరఖాస్తు విధానం….
ఈ పోస్టులకు గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన వారు ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్ వెబ్ సైట్ లోకి వెళ్లి నోటిఫికేషన్ వివరాలతో పాటు గూగుల్ ఫామ్ లింక్ కూడా పొందవచ్చు.
సంబంధిత కథనం