IIT Delhi : జేఈఈ లేకుండానే ఐఐటీ దిల్లీలో ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.. ఫీజు ఎంత?
IIT Delhi : మీరు జేఈఈ లేకుండానే ఐఐటీ దిల్లీలో ప్రవేశం పొందవచ్చు. అది ఎలా అంటారా? మీరు నేర్చుకునేదుకు కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీంతో జేఈఈ లేకుండానే ఐఐటీ దిల్లీలో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు.

ఇంజనీరింగ్ చేయాలని కలలు కనే విద్యార్థుల మొదటి ఆప్షన్ ఐఐటీ. అయితే ఇక్కడ అడ్మిషన్ పొందాలంటే అంత ఈజీ కాదు. విద్యార్థులు చాలా కష్టపడి జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలలో మంచి స్కోర్‌లతో ఉత్తీర్ణత సాధించాలి. . కానీ ఈ పరీక్షలు లేకుండా కూడా అడ్మిషన్ తీసుకోగల కోర్సులు కొన్ని ఉన్నాయి. భారతదేశంలోని వివిధ ఐఐటీ కళాశాలలు డిగ్రీలు లేదా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఇక్కడ కొన్ని కోర్సుల ప్రవేశానికి జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదు. దిల్లీ ఐఐటీ ఇలాంటి కోర్సులు అందిస్తుంది. కోర్సులు ఏంటి? ఫీజు వివరాలు చూద్దాం..
నిజానికి చాలా కాలంగా ఐఐటీలు టెక్నాలజీలో పలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను అందిస్తున్నాయి. జేఈఈ స్కోర్ లేకుండా ఈ కోర్సులు నాణ్యమైన విద్యను అందిస్తాయి. స్కిల్స్ డిమాండ్, రోబోటిక్స్, ఏఏఐ, డేటా సైన్స్, యూఎక్స్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజర్, ఏఏఆర్, వీఆర్‌లో ఐఐటీ దిల్లీ ప్రత్యేక సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది. వారాంతం, సాయంత్రం తరగతులు, ప్రాక్టికల్స్, పరిశ్రమపై దృష్టి పెట్టారు. మరిన్ని వివరాలకు ఐఐటీ దిల్లీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ రోబోటిక్స్
ఇది 5 నెలల కోర్సు. మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. వారాంతపు తరగతులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయి. ఫీజు రూ.1,69,000 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్, రీసెర్చ్ డెవలప్మెంట్ మొదలైన వాటిపై రోబోటిక్స్‌పై మంచి అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ దృష్టి పెడుతుంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సంబంధిత రంగాలలో నిపుణులు ఈ కోర్సు చేయవచ్చు.
అడ్వాన్స్ డ్ సర్టిఫికేట్ ఇన్ యూఎక్స్ స్ట్రాటజీ
ఈ కోర్సు మార్చి 16న ప్రారంభమవుతుంది. 6 నెలలు (మంగళవారం, గురువారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు) ఉంటుంది. ఫీజు రూ.1,70,000 ప్లస్ ట్యాక్స్.
అప్లైడ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
మార్చిలో ఈ కోర్సు ప్రారంభిస్తారు. 6 నెలలు (ఆదివారం, రాత్రి 8:00 నుండి 9:30 వరకు) ఉంటుంది. ఫీజు రూ.1,69,000 ప్లస్ ట్యాక్స్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత నేపథ్యం నుండి పట్టభద్రులు ఈ కోర్సు చేయవచ్చు.
డేటా సైన్స్‌లో అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్
ఈ కోర్సుకు సంబంధించిన ప్రారంభ తేదీ త్వరలో ప్రకటిస్తారు. 8 నెలలు కోర్సు ఉంటుంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, వ్యాపార నేపథ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.1,89,000 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది.
యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్ థింకింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్
ఈ కోర్సు వ్యవధి 6 నెలలగా ఉంటుంది. రూ.1,50,000. మంగళవారం, గురువారం, రాత్రి 8:00 నుండి 9:30 వరకు నిర్వహిస్తారు. డిజైన్, టెక్నాలజీ నిపుణులు నేర్చుకోవచ్చు.
సర్టిఫికెట్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్
ఈ కోర్సు ప్రారంభ తేదీ త్వరలో ప్రకటిస్తారు. 6 నెలలు ఉంటుంది. ఫీజు రూ.1,69,000 ప్లస్ ట్యాక్స్.