IICT Hyderabad Recruitment 2024 : ఐఐసీటీ హైదరాబాద్ లో 31 ఖాళీలు - రూ. లక్షకుపైగా జీతం, దరఖాస్తులకు కొన్ని గంటలే గడువు
IICT Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ లోని ఐఐసీటీలో 31 సైంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన గడువు రేపు(డిసెంబర్ 09) పూర్తి కానుంది. https://www.iict.res.in/ వెబ్ సైట్లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఆర్గానికి కెమిస్ట్రీ, అగ్రో కెమిస్ట్రీ, ఇన్ ఆర్గానికి కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్గానిక్ కోటింగ్, పాలిమర్స్, కెమికల్ బయాలజీతో పాటు డిజైన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 1,34,907 జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల వయసు 32 ఏళ్ల లోపు ఉండాలి.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ ప్రకటన - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్.
- ఉద్యోగాలు - సైంటిస్ట్
- మొత్తం ఖాళీలు - 31
- కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- అర్హతలు - అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ చేసి ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ - 09, డిసెంబర్ 2024.
- ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించరు.
- ఫీజు చెల్లించే లింక్ - https://www.onlinesbi.sbi/sbicollec
- ఎంపిక విధానం - అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తు రుసుం కింద రూ.500 చెల్లించాలి.
- అప్లికేషన్ లింక్ - https://www.iict.res.in/g4recruitment/
- అధికారిక వెబ్ సైట్ - https://www.iict.res.in/
వరంగల్ నిట్ లో 56 ఖాళీలు:
నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి వరంగల్‌లోని ‘నిట్’(NIT) ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మొత్తం 56 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో అత్యధికంగా ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్, డిప్యూటేషన్ ప్రాతిపదికన ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. కొన్ని పోస్టులకు అయితే రూ. 500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు. గ్రూప్ ఏ, బీ, సీ కేటగిరీలుగా పోస్టులున్నాయి.
జనవరి 7 చివరి తేదీ…
ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. నవంబర్ 30వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు జనవరి 07, 2025వ తేదీతో పూర్తి అవుతుంది. రాత్రి 11.59 గంటల లోపు అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే recruit_admn@nitw.ac.in మెయిల్ చేయవచ్చు. ఇక సాంకేతిక సమస్యలు ఉంటే recruit@nitw.ac.in మెయిల్ ను సంప్రదించవచ్చు.
అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. 56 ఏళ్లు మించకూడదు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్