Ignou Admissions : ఇగ్నో విశాఖ క్యాంపస్‌లో ప్రవేశాలు, దరఖాస్తు దాఖలు గడువు పొడిగింపు-ignou visakhapatnam campus admissions application last date extended ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ignou Admissions : ఇగ్నో విశాఖ క్యాంపస్‌లో ప్రవేశాలు, దరఖాస్తు దాఖలు గడువు పొడిగింపు

Ignou Admissions : ఇగ్నో విశాఖ క్యాంపస్‌లో ప్రవేశాలు, దరఖాస్తు దాఖలు గడువు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Updated Feb 08, 2025 05:26 PM IST

Ignou Admissions : ఇగ్నో విశాఖ క్యాంపస్ లో జనవరి ప్రవేశాల దరఖాస్తు దాఖలు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ.డిప్లమా, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు.

ఇగ్నో విశాఖ క్యాంపస్‌లో ప్రవేశాలు, దరఖాస్తు దాఖలు గడువు పొడిగింపు
ఇగ్నో విశాఖ క్యాంపస్‌లో ప్రవేశాలు, దరఖాస్తు దాఖలు గడువు పొడిగింపు

Ignou Admissions : ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్శిటీ (ఇగ్నో) విశాఖ‌ప‌ట్నం క్యాంప‌స్‌లో జనవరి ప్రవేశాల‌ దరఖాస్తు దాఖలు గడువు పొడిగించారు. ఈ మేర‌కు ఇగ్నో విశాఖ‌ప‌ట్నం ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ గోనిపాటి ధ‌ర్మారావు తెలిపారు. అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు దాఖలు చేసుకునేందుకు ఫిబ్రవ‌రి 15 వ‌ర‌కు గ‌డువు పెంచిన‌ట్లు ప్రక‌టించారు.

ఆన్‌లైన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ. డిప్లమా, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జ‌న‌వ‌రి 31గా నిర్ణయిస్తూ నోటిఫికేష‌న్ ఇచ్చారు. అయితే నోటిఫికేష‌న్‌లో ఇచ్చిన గ‌డువు ముగిసింది. దీంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు గ‌డువును పొడిగించిన‌ట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశాల‌కు త్వర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, గ‌డువు పొడిగించ‌డం విద్యార్థుల‌కు ఇదొక‌ అవ‌కాశమ‌ని అన్నారు.

రీ-రిజిస్ట్రేషన్ ఫీజు

విశాఖ‌ప‌ట్నం ప్రాంతీయ కేంద్రం ప‌రిధిలోని 11 జిల్లాల విద్యార్థులు ఆయా కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుని కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌వ‌చ్చన్నారు. పీజీ రెండో సంవత్సరం, డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, సెమిస్టర్ విధానంలో చదివే విద్యార్థులు రీ-రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా ఫిబ్రవ‌రి 15 వరకు చెల్లించవచ్చని అన్నారు. ఇతర వివరాలకు ఇగ్నో అధికారిక వెబ్ సైట్ www.ignou.ac.inని సంప్రదించ‌వ‌చ్చున‌ని తెలిపారు. లేదా విశాఖ‌ప‌ట్నంలోని ఎంవీపీ కాల‌నీలో ఉషోద‌య కూడ‌లిలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని సంప‌ద్రించ‌వ‌చ్చున‌ని తెలిపారు.

ఏఏ కోర్సులు ?

ఇగ్నో జ‌న‌వ‌రి-2025 సెష‌న్‌లో దాదాపు 300 గ్రూపుల వ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీ.జీ డిప్లమా, డిప్లమాల్లో వివిధ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిల్లో త‌మ‌కు నచ్చిన గ్రూప్‌ను ఎంచుకోవ‌చ్చు. గ్రూప్‌ను బ‌ట్టీ ఫీజులు ఉంటాయి.

ఇగ్నో అడ్మిష‌న్ అప్లికేష‌న్‌ ఇలా చేయాలి

Step 1 : ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ ignouadmission.samarth.edu.in పై క్లిక్ చేయండి.

Step 2 : స్క్రీన్‌పై ప్రదర్శించబడే 'ఇగ్నో రిజిస్ట్రేషన్ (న్యూ రిజిస్ట్రేషన్)' లింక్‌పై క్లిక్ చేయండి

Step 3 : తొలిత‌ అవసరమైన వ్యక్తిగత, ప్రాథమిక విద్యా వివరాలను ఇవ్వండి

Step 4 : యూజ‌ర్ నేమ్‌ను సెలెక్ట్ చేసుకుని, పాస్‌వ‌ర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. అది ఆల్ఫాన్యూమరిక్‌గా 8 నుండి 16 అక్షరాల మధ్య ఉండాలి.

Step 5 : అన్ని వివ‌రాలు ఇచ్చిన త‌రువాత స‌బ్మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.

Step 6 : మీ యూజర్‌నేమ్ తక్షణమే మీకు ఈ-మెయిల్, మొబైల్ నెంబ‌ర్‌కు పంపబడుతుంది.

Step 7 : ఇగ్నో 2025 ద‌ర‌ఖాస్తును చేసేందుకు లాగిన్ అవ్వండి.

Step 8 : సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి (స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, స్కాన్ చేసిన సంత‌కం. ఒక్కొక్క‌టి 100 కేబీ కంటే తక్కువ ఉండాలి).

Step 9 : రిజిస్ట్రేష‌న్ ఫీజు చెల్లించండి. (1. క్రెడిట్ కార్డ్ (మాస్టర్/వీసా), 2. డెబిట్ కార్డ్ (మాస్టర్/వీసా/రూపే) 3. నెట్ బ్యాంకింగ్ )

Step 10: మీ ఒరిజినల్ నుండి డాక్యుమెంట్‌లను స్కాన్ చేయాలని సూచించబడింది. మీరు డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత, తదుపరి బటన్‌ను క్లిక్ చేయండి. మీరు పూరించాల్సిన ఆన్‌లైన్ అప్లికేషన్‌కు సంబంధించిన మరిన్ని సమాచారం మీకు లభిస్తాయి.

Step 11 : ఆన్ లైన్ ఫారమ్ సబ్మిట్ చేసిన త‌రువాత దరఖాస్తు ఫారమ్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటవుట్ తీసుకోవాలి. విద్యార్థి హ్యాండ్‌బుక్, ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్న విధంగా అన్ని పత్రాలు, సర్టిఫికెట్ల హార్డ్ కాపీలు/ఫోటో కాపీలను జత చేయాలి. తుది ప్రవేశం కోసం కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం