Ignou Admissions : ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి-ignou vijayawada bsc nursing bed admissions 2024 check details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ignou Admissions : ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Ignou Admissions : ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Feb 04, 2025 06:29 PM IST

Ignou Admissions : ఇగ్నో విజయవాడ క్యాంపస్ లో బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ (బీఎడ్‌) ప్రవేశాల‌కు అప్లికేషన్లు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 21 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 16న విజయవాడ, తిరుపతిలో ప్రవేశ‌ప‌రీక్ష నిర్వహిస్తారు.

ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి
ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ అడ్మిషన్లకు నోటిఫికేషన్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Ignou Admissions : ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాల‌యం (ఇగ్నో) విజయవాడ క్యాంప‌స్‌లో 2025 విద్యా సంవత్సరం బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ (బీఎడ్‌) ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇగ్నో విజ‌య‌వాడ‌ ప్రాంతీయ కేంద్రం సీనియ‌ర్ రీజిన‌ల్ డైరెక్టర్ డీఆర్ శ‌ర్మ తెలిపారు. అభ్యర్థులు ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాల‌ని కోరారు.

yearly horoscope entry point

ఆన్‌లైన్ ద్వారా బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ-2025 కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు ద్వారా చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవ‌రి 21గా నిర్ణయించిన‌ట్లు పేర్కొన్నారు. మార్చి 16 (ఆదివారం)న ప్రవేశ‌ప‌రీక్ష నిర్వస్తామ‌ని తెలిపారు. విజ‌య‌వాడ ప్రాంతీయ కేంద్రం ప‌రిధిలో విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ప్రవేశ‌ప‌రీక్ష నిర్వహించ‌నున్నట్లు తెలిపారు.

విజ‌య‌వాడ‌ ప్రాంతీయ కేంద్రం ప‌రిధిలోని అన్ని జిల్లాల విద్యార్థులు ఆయా కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుని కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌వ‌చ్చన్నారు. ఇతర వివరాలకు ఇగ్నో అధికారిక వెబ్ సైట్ www.ignou.ac.inని సంప్రదించ‌వ‌చ్చున‌ని తెలిపారు. అలాగే విజ‌య‌వాడ‌లోని కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగ‌ణంలో ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని లేదా ద‌గ్గర‌లోని ఇగ్నో అధ్యయ‌న కేంద్రాన్ని లేదా 0866-2565253 ఫోన్ నెంబ‌ర్‌ను సంప‌ద్రించ‌వ‌చ్చున‌ని సూచించారు.

బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సుకు అర్హత‌లు

1. రిజిస్టర్డ్ నర్సులు అండ్ రిజిస్టర్డ్ మిడ్‌వైఫ్‌లు (ఆర్ఎన్ఆర్ఎం) 10+2తో పాటు జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్ఎం)లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. క‌నీసం రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. ఒక వేళ జీఎన్ఎం ప్రోగ్రామ్‌లో మిడ్‌వైఫ‌రీ చేయ‌ని వారు మిడ్‌వైఫ‌రీకి బ‌దులుగా ఇండియన్ న‌ర్సింగ్ కౌన్సిల్ సూచించిన 6-9 నెల‌ల వ్యవ‌ధి గ‌త న‌ర్సింగ్ కోర్సుల్లో ఏదైనా ఒక‌దానిలో స‌ర్టిఫికేట్ ఉండాలి.

2. రిజిస్టర్డ్ నర్సులు అండ్ రిజిస్టర్డ్ మిడ్‌వైఫ్‌లు (ఆర్ఎన్ఆర్ఎం) 10వ తరగతి (మెట్రిక్యులేషన్)తో పాటు జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్ఎం) మూడేళ్ల డిప్లొమా ఉండాలి. కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ఒక వేళ జీఎన్ఎం ప్రోగ్రామ్‌లో మిడ్‌వైఫ‌రీ చేయ‌ని వారు మిడ్‌వైఫ‌రీకి బ‌దులుగా ఇండియన్ న‌ర్సింగ్ కౌన్సిల్ సూచించిన 6-9 నెల‌ల వ్యవ‌ధి గ‌త న‌ర్సింగ్ కోర్సుల్లో ఏదైనా ఒక‌దానిలో స‌ర్టిఫికేట్ ఉండాలి.

3. 10+2తోపాటు జీఎన్ఎం ఉన్న అభ్యర్థులు ఆర్ఎన్ఆర్ఎం త‌రువాత అనుభ‌వం రెండేళ్ల లోపు ఉంటే అన‌ర్హులు. అలాగే పదో త‌ర‌గ‌తితో పాటు జీఎన్ఎం ఆర్ఎన్ఆర్ఎం త‌రువాత అనుభ‌వం ఐదేళ్ల కంటే త‌క్కువ అనుభ‌వం ఉంటే ద‌ర‌ఖాస్తు చేసేందుకు అన‌ర్హలు.

బీఈడీ కోర్సుకు అర్హత‌లు

1. గ్రాడ్యుయేష‌న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ డిగ్రీలో 50 శాతం మార్కులు రావాలి.

2. దరఖాస్తుదారులు బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హత పొందాలంటే ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన కోర్సులను పూర్తి చేసి ఉండాలి.

ఇగ్నో అడ్మిష‌న్ ఫారం ఇలా చేయాలి

Step 1 : ద‌ర‌ఖాస్తు ఫాం ఎలా చేయాలో ఈ వీడియో లింక్ https://drive.google.com/file/d/1_eZ30TmpYW_7xqo4XoYUTqvd7nGTyoAh/view క్లిక్ చేస్తే అందులో వివ‌రించ‌బ‌డింది.

Step 2 : బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సు కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ignounursing.samarth.edu.in/ పై క్లిక్ చేయండి. బీఈడీ కోర్సు కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ignou-bed.samarth.edu.in/index.php/registration/user/register పై క్లిక్ చేయండి.

Step 3 : స్క్రీన్‌పై ప్రదర్శించబడే 'న్యూ రిజిస్ట్రేషన్' పై క్లిక్ చేయండి

Step 4 : తొలుత‌ అవసరమైన వ్యక్తిగత, ప్రాథమిక విద్యా వివరాలను ఇవ్వండి

Step 5 : యూజ‌ర్ నేమ్‌ను సెలెక్ట్ చేసుకుని, పాస్‌వ‌ర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. అది ఆల్ఫాన్యూమరిక్‌గా 8 నుంచి 16 అక్షరాల మధ్య ఉండాలి.

Step 6 : అన్ని వివ‌రాలు ఇచ్చిన త‌రువాత స‌బ్మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.

Step 7 : మీ యూజర్‌నేమ్ తక్షణమే మీకు ఈ-మెయిల్, మొబైల్ నెంబ‌ర్‌కు పంపిస్తారు.

Step 8 : ఇగ్నో 2025 ద‌ర‌ఖాస్తును చేసేందుకు లాగిన్ అవ్వండి

Step 9 : సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి (స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, స్కాన్ చేసిన సంత‌కం. ఒక్కొక్కటి 100 కేబీ కంటే తక్కువ ఉండాలి).

Step 10 : రిజిస్ట్రేష‌న్ ఫీజు చెల్లించండి. (1. క్రెడిట్ కార్డ్ (మాస్టర్/వీసా), 2. డెబిట్ కార్డ్ (మాస్టర్/వీసా/రూపే) 3. నెట్ బ్యాంకింగ్ )

Step 11 : మీ ఒరిజినల్ డాక్యుమెంట్‌లను స్కాన్ చేయాలి. డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత, తదుపరి బటన్‌ను క్లిక్ చేయండి. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు సంబంధించిన మరిన్ని సమాచారం మీకు లభిస్తాయి.

Step 12 : ఆన్ లైన్ ఫారమ్ సబ్మిట్ చేసిన త‌రువాత దరఖాస్తు ఫారమ్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటవుట్ తీసుకోవాలి. విద్యార్థి హ్యాండ్‌బుక్, ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్న విధంగా అన్ని పత్రాలు, సర్టిఫికెట్ల హార్డ్ కాపీలు/ఫోటో కాపీలను జత చేయాలి. తుది ప్రవేశం కోసం కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.

అద‌న‌పు స‌మాచారం కోసం హెల్ప్ డెస్క్‌ను సంప్రదించండి

ఎ) స్టూడెంట్ సపోర్ట్ సెంటర్ 011-29572513 లేదా 011-29572514. మీరు ssc@ignou.ac.in కు ఈ-మెయిల్ చేయ‌వ‌చ్చు. అవసరమైతే మీరు www.igram.ignou.ac.in వద్ద మీ అభ్యర్థనను ఎస్కలేట్ చేసి వెబ్‌సైట్‌కు సమర్పించవచ్చు.

బి) స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన విద్యాపరమైన ప్రశ్నలను 01129572846, 01129572807, bscnursingpb@ignou.ac.in నంబర్లలో పంపవచ్చు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం