ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ లేదా ఇగ్నో రెండు వినూత్న విద్యా కార్యక్రమాలను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ డెవలప్మెంట్ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశానికి ఇగ్నో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇవి సమాచార మీడియా అండ్ కమ్యూనికేషన్ రంగంలో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉద్దేశించిన కోర్సులు. విధాన నిర్ణేతలు, ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించగల నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా ఈ కోర్సులను రూపొందించారు. సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక మరియు అమలులో పారదర్శకతను పెంపొందించడానికి డెవలప్మెంట్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం ముఖ్యమైన సాధనాలుగా పనిచేస్తాయని ఇగ్నో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఎన్జీవో ప్రొఫెషనల్స్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఎడ్యుకేటర్స్ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సిబ్బంది డెవలప్ మెంట్ ప్రాక్టీషనర్లు ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల్లో కెరీర్ అవకాశాలకు వీలు కల్పిస్తుంది.
ఈ కోర్సులు చేయడం ద్వారా ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంకులు న్యూస్ మీడియా, కమ్యూనిటీ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్జీవోలు, సీఎస్ఆర్ బృందాలు, దాతల నిధులతో నడిచే ప్రాజెక్టులు పరిశోధన, విద్యా సంస్థలు మొదలైన వాటిలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
ఆసక్తిగల దరఖాస్తుదారులు ఆన్లైన్ అప్లికేషన్, ఇతర వివరాల కోసం ఈ డైరెక్ట్ లింక్ ను క్లిక్ చేయవచ్చు.