బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి బిగ్ అప్డేట్! ఐడీబీఐ రిక్రూట్మెంట్ 2025లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంకు అధికారిక వెబ్సైట్ (idbibank.in) లో అప్లికేషన్ని దాఖలు చేయవచ్చు. ఈ దఫా రిక్రూట్మెంట్లో మొత్తం 676 జేఏఎం పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది. ముఖ్యమైన తేదీలు, వేతనంతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐడీబీఐ రిక్రూట్మెంట్ 2025లో ఎంపికైన వారిని జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఓ) గా అపాయింట్ చేస్తారు. ఇనీషియల్ వార్షిక సీటీసీ రూ. 6.14లక్షలు- రూ. 6.50లక్షల (క్లాస్ ఏ నగరాలకు) మధ్యలో ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా సాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది.
అర్హతతో పాటు ఇతర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఐడీబీఐ రిక్రూట్మెంట్ 2025ల రెండు స్టేజీలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్ టెస్ట్. మరొకటి పర్సనల్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ టెస్ట్‌లో లాజికల్ రీజనింగ్, డేటా ఎనాలసిస్- ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూట్, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్/ కంప్యూటర్/ ఐటీపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. సెక్షన్లవారీగా టైమింగ్ ఉంటుంది. ప్రతి సెక్షన్లో కనీస అర్హత మార్కులు, మొత్తం మీద కనీస అర్హత మార్కులు సాధించిన వారు ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్ అవుతారు.
వేకెన్సీలు, ఆన్లైన్ టెస్ట్‌లో పర్ఫార్మెన్స్ ఆధారంగా కటాఫ్ మార్కును ఐడీబీఐ బ్యాంకు నిర్ణయిస్తుంది. ఆ తర్వాత అభ్యర్థిని ఎంపిక చేస్తుంది.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండటం మంచిది.
సంబంధిత కథనం