చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ మే 2025 పరీక్షల ఫలితాలను రేపు, అంటే జులై 6న ప్రకటించనుంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ). ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.nic.in లో వాటిని చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు రోల్ నంబర్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
అధికారిక నోటీసు ప్రకారం, ఐసీఏఐ సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు అటు, ఇటు విడుదల అవుతాయి. సీఏ ఫౌండేషన్ ఫలితాలు సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తారు.
ఈ ఏడాది మే 2 నుంచి మే 14 వరకు సీఏ మే పరీక్షలను నిర్వహించింది ఐసీఏఐ.
గ్రూప్ 1కు సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్ష మే 3, 5, 7 తేదీలలో, గ్రూప్ 2 పరీక్ష మే 9, 11, 14 తేదీలలో నిర్వహించారు. ఫైనల్ పరీక్షలో, గ్రూప్ 1 పరీక్ష మే 2, 4, 6 తేదీలలో, గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరిగాయి.
అయితే, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా మే 9-14 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఇక సీఏ ఫౌండేషన్ పరీక్షలు మే 15, 17, 19, 21, 2025 తేదీలలో జరిగాయి.
అధికారిక ప్రకటన తర్వాత ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు కింద పేర్కొన్న దశలను అనుసరించవచ్చు:
స్టెప్ 1- అధికారిక వెబ్‌సైట్ icai.nic.in కి వెళ్లండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో, అవసరాన్ని బట్టి సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ లేదా ఫౌండేషన్ మే 2025 పరీక్ష ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి.
స్టెప్ 4- స్క్రీన్‌పై ప్రదర్శించిన మీ ఫలితాన్ని తనిఖీ చేయండి.
స్టెప్ 5- ఫలితాల పేజీని డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ ఉపయోగం కోసం ఒక కాపీని సేవ్ చేసుకోండి.
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం