సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలపై బిగ్ అప్డేట్! రివైజ్డ్ షెడ్యూల్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తాజాగా ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు 2025 మే 9 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. కానీ భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు.. మే 16, 2025 నుంచి మే 24, 2025 వరకు పరీక్షలు జరుగుతాయని ఐసీఏఐ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
రీషెడ్యూల్ చేసిన పరీక్షలను అదే పరీక్షా కేంద్రాల్లో, అదే సమయాల్లో - మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) / మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) నిర్వహిస్తామని ఐసీఏఐ తెలిపింది. అదనంగా, ఇప్పటికే జారీ చేసిన అడ్మిట్ కార్డులు రీషెడ్యూల్ తేదీలకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
పరీక్ష రివైజ్డ్ షెడ్యూల్తో పాటు పూర్తి నోటిఫికేషన్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఐసీఏఐ ప్రకారం, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫౌండేషన్ మే 2025 పరీక్ష.. షెడ్యూల్ ప్రకారం మే 15, 17, 19, 21, 2025 న జరుగుతుంది.
పరీక్ష ఏ రోజునైనా కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం / స్థానిక సెలవుదినంగా ప్రకటించినట్లయితే పరీక్ష షెడ్యూల్లో ఎటువంటి మార్పు ఉండదని ఐసీఏఐ పేర్కొంది.
పైన చెప్పినట్టు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన నేపథ్యంలో ఐసీఏఐ పరీక్షలను వాయిదా వేసింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్, పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు పరీక్షలు [ఇంటర్నేషనల్ టాక్సేషన్ - అసెస్మెంట్ టెస్ట్ (ఐఎన్టీటీటీ ఏటీ)] మే 2025 మిగిలిన పేపర్లు మే 9 నుంచి మే 14, 2025 వరకు జరగాల్సి ఉంది.
మరిన్ని వివరాలకు విద్యార్థులు ఐసీఏఐ వెబ్సైట్ను చూడాలని అధికారులు సూచించారు.
సంబంధిత కథనం