చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) మే పరీక్ష ఫలితాలను విడుదల చేసే తేదీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ ఫలితాలు 2025 జూలై 6న విడుదల చేయనున్నట్లు ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ స్కోర్లను ఏసీఏఐ అధికారిక వెబ్సైట్ icai.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి రోల్ నెంబర్ తో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2025 మేలో నిర్వహించిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను 2025 జూలై 6న ఈ క్రింది సమయాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఐసీఏఐ సీఏ ఫైనల్ మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు జూలై 6 మధ్యాహ్నం 2 గంటలకు, సిఎ ఫౌండేషన్ ఫలితాలు జూలై 6 సాయంత్రం 5 గంటలకు వెలువడుతాయి. ఈ పరీక్షలను ఐసీఏఐ మే 2 నుంచి 14 వరకు నిర్వహించింది.
ఐసిఎఐ సిఎ 2025 స్కోర్లను డౌన్లోడ్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
సంబంధిత కథనం