IBPS SO Mains Result 2025: ఎస్ఓ మెయిన్స్ 2025 స్కోర్ కార్డ్ లను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మార్చి 20, 2025న విడుదల చేసింది. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫలితాల స్కోర్ కార్డును అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కోర్ కార్డులను అభ్యర్థులు మార్చి 20వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత అవి అందుబాటులో ఉండవు. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ రిజల్ట్ 2025 స్కోర్ కార్డ్ ను చెక్ చేయడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
1. ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐబీపీఎస్ ఎస్ఓ రిజల్ట్ 2025 స్కోర్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ కార్డు డిస్ప్లే అవుతుంది.
5. స్కోర్ కార్డును చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
7. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.
ఎ. అభ్యర్థి సరిగ్గా సమాధానాలు ఇచ్చిన ప్రశ్నల వచ్చిన మార్కులు గణించి, వాటిలో నుంచి తప్పు సమాధానాలకు వర్తించే పెనాల్టీ మార్కులను తీసివేసి, ఫైనల్ స్కోర్ కార్డును రూపొందిస్తారు.
బి. 'రాజ భాష అధికారి (స్కేల్-1)' మినహా ఇతర పోస్టులకు స్కోర్ ను రెండు అంకెలకు పరిమితం చేశారు.
సి) 'రాజ భాష అధికారి (స్కేల్-1)' పోస్టుకు తుది స్కోర్లు, ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై వచ్చిన స్కోర్లను డిస్క్రిప్టివ్ ప్రశ్నల స్కోరుకు కలుపుతారు.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.
సంబంధిత కథనం