IBPS RRB Result 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 ఫలితాల వెల్లడి; ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ విడుదల
IBPS RRB Result 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ విడుదలైంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు కింద పేర్కొన్న లింక్ ను క్లిక్ చేసి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB) ఖాళీగా ఉన్న 9923 పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
IBPS RRB Result 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 ప్రొవిజనల్ కేటాయింపు జాబితాను బుధవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ల్లో (RRB) క్లర్క్, పీవో పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ను విడుదల చేశారు. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
నిబంధనలు వర్తిస్తాయి..
ప్రభుత్వ నిబంధనల మేరకు మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ను రూపొందించారు. రిజర్వేషన్ విధానంపై మార్గదర్శకాలు, భారత ప్రభుత్వం/ ఇతరులు ఎప్పటికప్పుడు జారీ చేసే వివిధ మార్గదర్శకాలు, పరిపాలనా అవసరాలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ లిస్ట్ ను రూపొందించారు. సిఆర్ పి ఆర్ ఆర్ బి XIII కింద తాత్కాలిక కేటాయింపు పొందిన అభ్యర్థి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ప్రమాణాలను పాటించాలి. తనకు కేటాయించిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (RRB) సంతృప్తి మేరకు గుర్తింపు ధృవీకరణ పొందాల్సి ఉంటుంది.
ఐబీపీఎస్ ఫలితాలు
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్, ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3లకు మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ రిజల్ట్స్ ప్రొవిజనల్ కేటాయింపు జాబితాను ఐబీపీఎస్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్ వర్డ్ లను నమోదు చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
రిజల్ట్ చెక్ చేసే విధానం
- ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిజల్ట్ 2024 (IBPS RRB Result 2024) ప్రొవిజనల్ కేటాయింపు జాబితా లింక్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
- రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చండి.
9923 పోస్ట్ ల భర్తీ
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB) ఖాళీగా ఉన్న 9923 గ్రూప్ ఏ ఆఫీసర్లు (స్కేల్-1, 2, 3), గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.