అలర్ట్​! తాత్కాలిక పరీక్షల క్యాలెండర్​ని సవరించిన IBPS- కొత్త డేట్స్​ ఇవే..-ibps revises tentative calendar for 2025 26 important dates here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  అలర్ట్​! తాత్కాలిక పరీక్షల క్యాలెండర్​ని సవరించిన Ibps- కొత్త డేట్స్​ ఇవే..

అలర్ట్​! తాత్కాలిక పరీక్షల క్యాలెండర్​ని సవరించిన IBPS- కొత్త డేట్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu

ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​.. 2025-26 సంవత్సరానికి సంబంధించిన సవరించిన తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐబీపీఎస్​ రిక్రూట్​మెంట్​ 2025

2025-26 సంవత్సరానికి సంబంధించిన సవరించిన తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​) తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత వివరాలను ibps.in వెబ్‌సైట్‌లో చెక్​ చేసుకోవచ్చు. ఈ సవరించిన క్యాలెండర్ ప్రకారం, ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టుల కోసం ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు 17, 23, 24 తేదీలలో ఐబీపీఎస్​ నిర్వహించనుంది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 12న జరుగుతుంది.

సవరించిన తాత్కాలిక క్యాలెండర్ వివరాలు తెలుసుకోండి..

పీఎస్​బీల కోసం..

Probationary Officers/ Management Trainees (PO/MT)Specialist Officers (SPL)Customer Service Associates (CSA)
ప్రిలిమ్స్​ఆగస్ట్​ 17, 23, 24, 2025ఆగస్ట్​ 30అక్టోబర్​ 4, 5, 11, 2025
మెయిన్స్​అక్టోబర్​ 12నవంబర్​ 9నవంబర్​ 29

ఆర్​ఆర్​బీల కోసం..

Officer Scale IOfficer Scale II and IIIOffice Assistants
ప్రిలిమ్స్​నవంబర్​ 22, 23, 2025ఇంకా వెల్లడించలేదుడిసెంబర్​ 6, 7, 13, 14, 2025
మెయిన్స్​డిసెంబర్​​ 28, 2025డిసెంబర్​ 28, 2025ఫిబ్రవరి 1, 2026

ఐబీపీఎస్​ రిక్రూట్​మెంట్​ 2025 వివరాలు..

ఐబీపీఎస్​ తన రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. వర్తించే చోట, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఒకే రిజిస్ట్రేషన్ ఉంటుంది.

రిజిస్ట్రేషన్ సమయంలో, అభ్యర్థులు కింది పత్రాలను అప్‌లోడ్ చేయాలి:

ఫోటోగ్రాఫ్ – 20 kb నుంచి 50 kb వరకు, .jpeg ఫైల్‌లో ఉండాలి.

సిగ్నేచర్​ – 10 kb నుంచి 20 kb వరకు, .jpeg ఫైల్‌లో ఉండాలి.

ఫింగర్​ప్రింట్​ – 20 kb నుండి 50 kb వరకు, .jpeg ఫైల్‌లో ఉండాలి.

చేతితో రాసి, డిక్లరేషన్ స్కాన్ చేసిన కాపీ (ఆయా నోటిఫికేషన్‌లలో అందుబాటులో ఉండే ఫార్మాట్ ప్రకారం) – 50 kb నుంచి 100 kb వరకు, .jpeg ఫైల్‌లో ఉండాలి.

అప్లికేషన్ నింపేటప్పుడు, అభ్యర్థులు తమ లైవ్ ఫోటోగ్రాఫ్‌లను కూడా క్యాప్చర్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ పరీక్షలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in ని సందర్శించాలని సూచించారు.

ఐబీపీఎస్​ తాజాగా విడుదల చేసిన ఈ క్యాలెండర్ కూడా తాత్కాలికమైనదని, తేదీలు తరువాత మారవచ్చని అభ్యర్థులు గమనించాలి. పరిపాలనా కారణాలు, కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సలహాలు మొదలైన వాటి కారణంగా "పరీక్ష తేదీలను, మార్గదర్శకాలు/విధానాలతో సహా ఎంపిక ప్రక్రియను మార్చే హక్కు" ఐబీపీఎస్​కి ఉందని సంస్థ తెలిపింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం