IBPS PO Mains Result : ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఫలితాలు విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
IBPS PO Mains Result : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) పీఓ మెయిన్స్ 2024 ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు ఫలితాలను ibps.in వద్ద చెక్ చేసుకోవచ్చు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ (సీఆర్పీ పీఓ/ఎంటీ-14) మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ)కు హాజరైన అభ్యర్థులు ibps.in ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ రిజల్ట్ 2024 చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1. ibps.in ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
స్టెప్ 2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ రిజల్ట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4. సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది.
స్టెప్ 5. రిజల్ట్ చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
ఇన్ఫర్మేషన్ బులెటిన్ ప్రకారం 2024 నవంబర్‌లో ఆన్లైన్ పరీక్ష జరిగింది. ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ పరీక్షలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష, 25 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి.
తర్వాత ఏంటి..?
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఫలితాల తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు. ఇంటర్వ్యూ రౌండ్ 2025 ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు కాల్ లెటర్ లేదా అడ్మిట్ కార్డులో సెంటర్, వేదిక చిరునామా, సమయం, తేదీని తెలియజేస్తారు. ఇంటర్వ్యూ రౌండ్ 100 మార్కులకు, కనీస అర్హత మార్కులు 40 శాతం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 35 శాతం) అని గుర్తుపెట్టుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా 3955 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 1న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఆగస్టు 21న ముగిసింది.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
సంబంధిత కథనం