IBPS Exams Schedule: ఐబీపీఎస్ 2025 రిక్రూట్‌మెంట్ పరీక్షల క్యాలెండర్ విడుదల.. ఈ ఏడాది షెడ్యూల్ ఇదే..
IBPS Exams Schedule: ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి 2025 పరీక్షలు జరిగే తేదీలను ఐబీపీఎస్ విడుదల చేసింది. 2025-26 సంవత్సరాల్లో కామన్ రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ఖరారు చేసింది.
IBPS Exams Schedule: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS ఉద్యోగ నియమాక పరీక్షల క్యాలెండర్- 2025ను విడుదల చేసింది. ఈ ఏడాది కాస్త అటుఇటుగా ఈ తేదీల్లో పరీక్షలు జరగొచ్చని ఐబీపీఎస్ పేర్కొంది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్ నియమాకాలు, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగ నియామకాలకు తేదీలను ప్రకటించారు. ప్రాథమికంగా ఈ తేదీలను ప్రకటించినా పరీక్షలు జరిగే సమయానికి మార్పులుజరగొచ్చు.
2025 క్యాలెండర్‌లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులుకోసం ఆన్‌లైన్ కామన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీలు (2025-2026) ఉన్నాయి. ఉజ్జాయింపుగా ఖరారు చేసిన క్యాలెండర్‌ను IBPS అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
IBPS క్యాలెండర్ ప్రకారం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ I ప్రిలిమ్స్ పరీక్ష జూలై 27, ఆగస్టు 2, 3 తేదీలలో జరుగుతాయి.
రూరల్ బ్యాక్స్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు 30, సెప్టెంబర్ 6 మరియు 7, 2025 తేదీలలో జరుగుతాయి. మెయిన్ పరీక్ష ఆఫీసర్ స్కేల్ I, II మరియు III పరీక్షలు సెప్టెంబర్ 13న మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నవంబర్ 9న జరుగుతుంది.
IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4, 5 మరియు 11, 2025 తేదీలలో మరియు మెయిన్ పరీక్ష నవంబర్ 29, 2025న జరుగుతాయి.
IBPS ప్రొబేషనరీ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్ 22 మరియు 23, 2025 తేదీలలో మరియు మెయిన్ పరీక్ష జనవరి 4, 2026న జరుగుతుంది.
IBPS కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 6, 7, 13 మరియు 14, 2025 తేదీలలో మరియు మెయిన్ పరీక్ష ఫిబ్రవరి 1, 2026న జరుగుతుంది.
ఐబీపీఎస్ పరీక్షల నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అన్ని పరీక్షలు ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్ష రెండింటికీ ఒకేసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
IBPS క్యాలెండర్ 2025: నమోదు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు
అభ్యర్థులు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన స్పెసిఫికేషన్ ప్రకారం ఈ క్రింది పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తుదారుని ఫోటోగ్రాఫ్ – 20 kb నుండి 50 kb .jpeg ఫైల్‌లో
దరఖాస్తుదారుని సంతకం – 10 kb నుండి 20 kb .jpeg ఫైల్‌లో
దరఖాస్తుదారుని బొటనవేలు ముద్ర – 20 kb నుండి 50 kb .jpeg ఫైల్‌లో
ఫార్మాట్ ప్రకారం చేతితో రాసిన ప్రకటన యొక్క స్కాన్ చేసిన కాపీ, దీనికి నమూనా సంబంధిత నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటుంది – 50 kb నుండి 100 kb .jpeg ఫైల్‌లో అప్‌లోడ్ చేయాలి.
అభ్యర్థులు వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ఉపయోగించి దరఖాస్తు సమయంలో వారి “లైవ్ ఫోటోగ్రాఫ్”ను క్యాప్చర్ చేసి అప్‌లోడ్ చేయాలి. సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ను చూడవచ్చు.
ఐబీపీఎస్ 2025 వార్షిక క్యాలెండర్ కోసం ఈ లింకును అనుసరించండి. https://www.ibps.in/wp-content/uploads/IBPS_CALENDAR_2025-26-for-Website.pdf