ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే అద్భుత అవకాశం; 3717 పోస్ట్ ల భర్తీకి నేటి నుంచే రిజిస్ట్రేషన్; డిగ్రీ ఉంటే చాలు-ib acio grade 2 exam 2025 registration begins for 3717 posts at mhagovin ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే అద్భుత అవకాశం; 3717 పోస్ట్ ల భర్తీకి నేటి నుంచే రిజిస్ట్రేషన్; డిగ్రీ ఉంటే చాలు

ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే అద్భుత అవకాశం; 3717 పోస్ట్ ల భర్తీకి నేటి నుంచే రిజిస్ట్రేషన్; డిగ్రీ ఉంటే చాలు

Sudarshan V HT Telugu

ప్రతిష్టాత్మక ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే అద్భుత అవకాశం ఇది. 3717 పోస్టుల భర్తీకి ఐబీ ఏసీఐఓ గ్రేడ్ 2 ఎగ్జామ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇవ్వబడింది.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే అద్భుత అవకాశం

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ అంటే ఏసీఐఓ-2/ఎక్స్ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఏసీఐఓ గ్రేడ్ 2 ఎగ్జామ్ 2025కు దరఖాస్తు ప్రక్రియ జూలై 19 నుంచి ప్రారంభమైంది.

జూలై 19 నుంచి ఆగస్టు 10 వరకు..

ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ లో లింక్ ను చూడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 19న ప్రారంభమై ఆగస్టు 10, 2025న ముగుస్తుంది. ఎస్బీఐ చలానా ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 12 ఆగష్టు 2025. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 3717 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు

1. అన్ రిజర్వ్డ్: 1537 పోస్టులు

2. ఈడబ్ల్యూఎస్: 442 పోస్టులు

3. ఓబీసీ: 946 పోస్టులు

4. ఎస్సీ: 566 పోస్టులు

5. ఎస్టీ: 226 పోస్టులు

అర్హతలు, ఎంపిక విధానం

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 2025 ఆగస్టు 10 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానంలో టైర్ 1 పరీక్ష, టైర్ 2 పరీక్ష, టైర్ 3/ ఇంటర్వ్యూ ఉంటాయి.

పరీక్ష విధానం

టైర్-1 పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూలు ఉంటాయి. ఇవి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్/ లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ విభాగాలుగా ఉంటాయి. ఒక్కో విభాగంలో ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున 20 ప్రశ్నలు ఉంటాయి. టైర్-2 పరీక్షలో 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. టైర్ 3 లో ఇంటర్వ్యూ ఉంటుంది. టైర్-1, టైర్-2, టైర్-3 ల్లో ఉమ్మడిగా వచ్చిన మార్కుల ఆధారంగా ఏసీఐవో-2/ఎక్స్ఈ పోస్టులకు తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. పోస్టుకు తుది ఎంపిక అనేది క్యారెక్టర్ మరియు పూర్వ ధృవీకరణను విజయవంతంగా పూర్తి చేయడానికి లోబడి ఉంటుంది. తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ మొదలైనవి ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు

అప్లికేషన్ ఫీజు రూ.100/-, మరియు రిక్రూట్ మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ రూ.550/-. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, చలానా మొదలైన వాటి ద్వారా చెల్లించాలి. అభ్యర్థి భవిష్యత్తు రిఫరెన్స్ కోసం పేమెంట్ అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్ ను జనరేట్ చేయవచ్చు.

వివరణాత్మక నోటిఫికేషన్

అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.