HYDRAA Jobs : హైడ్రాలో 970 ఉద్యోగాలు! నెలకు రూ.22,750 జీతం.. పూర్తి వివరాలు ఇవే-hydra is going to fill 970 jobs on contract basis soon ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Hydraa Jobs : హైడ్రాలో 970 ఉద్యోగాలు! నెలకు రూ.22,750 జీతం.. పూర్తి వివరాలు ఇవే

HYDRAA Jobs : హైడ్రాలో 970 ఉద్యోగాలు! నెలకు రూ.22,750 జీతం.. పూర్తి వివరాలు ఇవే

Basani Shiva Kumar HT Telugu
Jan 03, 2025 02:02 PM IST

HYDRAA Jobs : హైడ్రా.. హైదరాబాద్ నగరంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. అలాంటి సంస్థ ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి అండుగులు వేస్తోంది. అతి త్వరలోనే దాదాపు 970 ఖాళీలను భర్తీ చేయబోతోంది. కొత్తగా వచ్చే ఉద్యోగులకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో కూడా నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైడ్రాలో 970 ఉద్యోగాలు
హైడ్రాలో 970 ఉద్యోగాలు (@Comm_HYDRAA)

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) హైదారాబాద్ నగరంలో.. 970 కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. TNIE లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం.. ఈ ఏజెన్సీ ఒక సంవత్సరం పాటు అవుట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించుకోబోతోంది.

yearly horoscope entry point

వీరి బాధ్యత అదే..

నీటి వనరులు, పార్కులు, లేఅవుట్లలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు ఉన్న నాలాలను రక్షించడంలో హైడ్రాకు సహాయం చేయడం వీరి బాధ్యత. అంతేకాకుండా అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించడం కూడా ఉంటుంది. హైదరాబాద్‌లోని ఫుట్‌పాత్‌లు, సరస్సులు, ఖాళీ స్థలాలు, పార్కులు మొదలైన వాటిపై ఆక్రమణలను తొలగించడానికి హైడ్రాకు కాంట్రాక్ట్ ఉద్యోగులు సాయం చేయనున్నారు.

7 ప్యాకేజీలుగా..

TNIE కథనం ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులను ఏడు ప్యాకేజీలుగా విభజిస్తారు. మేనేజర్లకు రెండు, అసిస్టెంట్లకు ఐదు ప్యాకేజీలు ఉంటాయి. వీరి జీతాల కోసం మొత్తం ఖర్చు సంవత్సరానికి రూ. 31.70 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మేనేజర్లకు నెలకు రూ.22,750 జీతం లభించే అవకాశం ఉండగా.. అసిస్టెంట్ నెలవారీ జీతం రూ.19,500గా ఉంటుందని తెలుస్తోంది.

హైడ్రా పోలీస్ స్టేషన్..

త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ రాబోతోందని.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇటీవల వెల్లడించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై ఎక్కువగా దృష్టిపెట్టామన్నారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని.. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని ఇటీవల వ్యాఖ్యానించారు

డబ్బున్న వారే ఎక్కువ..

'ఎక్కువగా డబ్బున్న వారే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదలకంటే ధనికులే ఎక్కవగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలవారు ఆక్రమణల్లో ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ స్పష్టం చేశారు.

త్వరలో ఎఫ్ఎం ఛానెల్..

త్వరలోనే హైడ్రా ఎఫ్ఎం రేడియో ఛానెల్ కూడా తీసుకురాబోతున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా పరిధిపైనా వివరణ ఇచ్చారు. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేస్తుందని చెప్పారు. హైడ్రా ఏర్పాటు తర్వాత.. ఇప్పటి వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని రంగనాథ్ వివరించారు. భవిష్యత్తులోనూ ఆక్రమణలు కాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

Whats_app_banner