ఐసీఎంఆర్ నిన్ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల-దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలివే-hyderabad icmr nin cet 2025 notification released application process key dates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఐసీఎంఆర్ నిన్ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల-దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలివే

ఐసీఎంఆర్ నిన్ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల-దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలివే

హైదరాబాద్ ఐసీఎంఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ నిర్వహించిన నిన్ సెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు అర్హులైన విద్యార్థులు జూన్ 2లోపు ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించాలి.

ఐసీఎంఆర్ నిన్ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల-దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలివే

హైదరాబాద్ లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ నిన్ సెట్(NIN CET 2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-2027 విద్యాసంవత్సరానికి రెండేళ్ల ఎంఎస్సీ(అప్లైడ్‌ న్యూట్రిషన్‌), ఎంఎస్సీ(స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 2లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు

1. ఎంఎస్సీ(అప్లైడ్‌ న్యూట్రీషన్‌)

2. ఎంఎస్సీ(స్పోర్ట్స్‌ న్యూట్రీషన్‌)

విద్యార్హత

సంబంధిత విభాగాల్లో ప్రవేశాలకు డిగ్రీ(బీఎస్సీ),ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

ఫీజు వివరాలు

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు- రూ.3000,
  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు- రూ.1500

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ - మే 06, 2025
  • దరఖాస్తు చివరి తేదీ - జూన్ 02, 2025
  • అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ - జూన్ 09, 2025
  • పరీక్ష తేదీ - జులై 06, 2025 (ఆదివారం)

దరఖాస్తు విధానం ఎలా?

1. రిజిస్టర్ చేసుకోండి

మీరు న్యూ యూజర్ అయితే, పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలతో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వస్తుంది.

2. దరఖాస్తు ఫారమ్ నింపండి

  • రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  • ఫైనల్ సబ్మిట్ కు ముందు దరఖాస్తు వివరాలను జాగ్రత్తగా సమీక్షించండి.

3. దరఖాస్తు రుసుము చెల్లింపు

అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులను (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI, QR కోడ్ మొదలైనవి) ఉపయోగించి దరఖాస్తు రుసుము చెల్లించండి.

4. ఫొటో, సంతకం అప్‌లోడ్

రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో అభ్యర్థులు ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.

5. దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి

దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. అనంతరం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం