హైదరాబాద్ హెచ్ఏఎల్ లో 16 టెక్నీషియన్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి-hyderabad hal non executive 16 technician posts apply online eligibility salary details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  హైదరాబాద్ హెచ్ఏఎల్ లో 16 టెక్నీషియన్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్ హెచ్ఏఎల్ లో 16 టెక్నీషియన్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్ లోని హెచ్ఏఎల్ లో 16 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు మే 7వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

హైదరాబాద్ హెచ్ఏఎల్ లో 16 టెక్నీషియన్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దేశవ్యాప్తంగా 21 ఉత్పత్తి/ఓవర్‌హాల్/సర్వీస్ విభాగాలు, 9 R&D కేంద్రాలు, 1 ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ విభాగంతో ఒక ప్రధాన ఏరోనాటికల్ పరిశ్రమగా ఉంది. హెచ్ఏఎల్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, ఏరో-ఇంజిన్లు, ఇండస్ట్రియల్ మెరైన్ గ్యాస్ టర్బైన్‌లు, ఏవియానిక్స్ & సిస్టమ్స్, ఉపగ్రహ & ప్రయోగ వాహనాల కోసం నిర్మాణాత్మక భాగాలు తయారుచేస్తుంది.

16 టెక్నీషియన్ పోస్టులు

హైదరాబాద్‌ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లోని ఏవియానిక్స్ డివిజన్ లో నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో డిప్లొమా టెక్నీషియన్‌గా నాలుగు సంవత్సరాల కాలానికి తాత్కాలికంగా పనిచేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు మే 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు

1. డిప్లొమా టెక్నీషియన్‌(మెకానికల్‌)- 01 ఖాళీలు

2. డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రికల్)- 02 ఖాళీలు

3. డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రానిక్స్‌) - 13 ఖాళీలు

మొత్తం పోస్టులు : 16

ముఖ్యాంశాలు

  1. పోస్టులను అనుసరించి ఆయా విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
  2. మే 7, 2025 నాటికి అభ్యర్థుల వయోపరిమితి 28 ఏళ్లు ఉండాలి.
  3. ఎంపికైన వారికి నెలకు రూ.23,000 వేతనం అందిస్తారు.
  4. అభ్యర్థులు https://hal-india.co.in/career-details వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.
  5. ఏప్రిల్ 24, 2025 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  6. మే 7, 2025 దరఖాస్తుకు చివరి తేదీ
  7. పరీక్ష తేదీ - మే 25, 2025
  8. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు వివరాలు

  1. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు - రూ.200,
  2. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు- ఫీజు లేదు.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు

చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రకటన జారీ చేసింది. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఈ పోస్టును భర్తీ చేయనుంది. మహబూబ్ నగర్ డీసీసీబీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.

అర్హతలు

ఈ పోస్టుకు ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టుకు సీఏఐఐబీ, డీబీఎఫ్‌ డిప్లొమా(కోఆపరేటివ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్), చార్టెడ్ అకౌంట్, పీజీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులవుతారు. కనీసం 8 ఏళ్లపాటు బ్యాంకింగ్ సెక్టార్ లో పని చేసిన అనుభవం ఉండాలి.

తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలి. ఎంపికైన వారు మూడేళ్లపాటు పని చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించరు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 28వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారి నెలకు రూ.97,620 జీతం చెల్లిస్తారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం