HCU Admissions 2025 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో పీజీ ప్రవేశాలు - నోటిఫికేష‌న్ జారీ, ముఖ్య తేదీలివే-hyderabad central university issued admission notification for pg courses 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Hcu Admissions 2025 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో పీజీ ప్రవేశాలు - నోటిఫికేష‌న్ జారీ, ముఖ్య తేదీలివే

HCU Admissions 2025 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో పీజీ ప్రవేశాలు - నోటిఫికేష‌న్ జారీ, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 23, 2025 03:29 PM IST

Hyderabad Central University Admissions 2025 : పీజీ ప్రవేశాలకు హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 41 కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. సీయూఈటీ (పీజీ)-2025 స్కోర్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తారు. https://exams.nta.ac.in/ లింక్ తో అప్లయ్ చేసుకోవాలి.

హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో పీజీ ప్రవేశాలు
హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో పీజీ ప్రవేశాలు

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 2025 -2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ప్రవేశాలు ఉంటాయి. మొత్తం 41 కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు https://exams.nta.ac.in/ లింక్ తో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

yearly horoscope entry point

ఆన్ లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 1వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సీయూఈటీ (పీజీ)-2025 స్కోర్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.

మార్చి 13వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 31వ తేదీతో పూర్తవుతాయి. www.nta.ac.in లేదా https://exams.nta.ac.in/CUET-PG/ వెబ్ సైట్ లో ఫలితాలను ప్రకటిస్తారు. సీయూఈటీ పీజీ స్కోర్ మాత్రమే కాకుండా… రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీట్ల ప్రక్రియ ఉంటుంది. కోర్సుల‌తో పాటు పూర్తి వివ‌రాల కోసం https://uohyd.ac.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ముఖ్య వివరాలు :

  • పీజీ ప్రవేశాల ప్రకటన - హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ.
  • MA, MSc, ఎంవీఏ, ఎంఈడీ, ఎంపీహెచ్‌, ఎంపీఏ, ఎంఎఫ్‌ఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 41 సబ్జెక్టులు ఉన్నాయి.
  • అర్హతలు - సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొందాలి. సీయూఈటీ (పీజీ)-2025 స్కోరు సాధించి ఉండాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ 1 ఫిబ్రవరి 2025
  • అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.
  • మార్చి 13వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 31వ తేదీతో పూర్తవుతాయి.
  • www.nta.ac.in లేదా https://exams.nta.ac.in/CUET-PG/ వెబ్ సైట్ లో ఫలితాలను ప్రకటిస్తారు.
  • ఏమైనా సందేహాలు ఉంటే +91-11-40759000 నెంబర్ ను సంప్రదివచ్చు.
  • helpdesk-cuetpg@nta.ac.in  మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం