ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా… అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. మరోవైపు అభ్యర్థులు పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ప్రిపేర్ అవతున్న అభ్యర్థుల కోసం వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
డీఎస్సీ పరీక్షలో మంచి స్కోర్ సాధించటం కోసం అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతుంటారు. అయితే పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. డీఎస్సీ పరీక్షలో ప్రతి మార్కు కూడా కీలకమని గుర్తు చేస్తున్నారు.
ఏపీ మెగా డీఎస్సీలో భాగాగం…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈ పోస్టుల కోసం అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 39,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. కడప జిల్లాలో 15,812 మంది మాత్రమే అప్లయ్ చేశారు. ఇక వేరే రాష్ట్రాలకు చెందిన వారు 7 వేలకుపైగా ఉన్నారు. ఈసారి అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు.
విద్యాశాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం… మే 30వ తేదీ నుంచి నుంచి మెగా డీఎస్సీ హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభమవుతాయి. జులై 6వ తేదీ వరకు జరుగుతాయి. సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రిలిమినరీ కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదలవుతాయి.
సంబంధిత కథనం