తెలంగాణ టెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ - సిలబస్ విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-how to download telangana tet 2025 syllabus know these steps ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ టెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ - సిలబస్ విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ - సిలబస్ విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. కొత్త నోటిఫికేషన్ (జూన్ సెషన్) కు సంబంధించిన సిలబస్ అందుబాటులోకి వచ్చింది. టెట్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు... అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి...

తెలంగాణ టెట్ సిలబస్ 2025

తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్ టెట్ (జూన్ సెషన్)నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

టెట్ కోసం ఏప్రిల్‌ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్‌ 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచుతారు. జులై 22న టెట్‌ రిజల్ట్స్ ప్రకటిస్తారు.

టీజీ టెట్ 2025 సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. టెట్ అభ్యర్థులు తెలంగాణ విద్యాశాఖ అధికారిక  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే Click Here for TG TET June-2025 ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ హోం పేజీలో కనిపించే Syllabus ఆప్షన్ పై నొక్కాలి.
  4. 15 పేపర్ల పేర్లు కనిపిస్తాయి. ఆ పక్కనే సిలబస్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై నొక్కితే సిలబస్ కాపీ డౌన్లోడ్ అవుతుంది.
  5. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

టెట్ పరీక్షా విధానం:

ఇక తెలంగాణ ‘టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు.

  • పేపర్‌-2లో మళ్లీ గణితం, సైన్స్‌, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది.
  • పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి.
  • ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
  • ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు.
  • ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అయితే ఇందులో జనరల్‌ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగైతేనే టెట్ లో అర్హత సాధించినట్లు అవుతారు. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం