TG Courts Recruitment 2025 : తెలంగాణలోని కోర్టు ఉద్యోగాల అప్డేట్స్ - హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి-how to download telangana district court jobs hall tickets 2025 know these steps ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Courts Recruitment 2025 : తెలంగాణలోని కోర్టు ఉద్యోగాల అప్డేట్స్ - హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG Courts Recruitment 2025 : తెలంగాణలోని కోర్టు ఉద్యోగాల అప్డేట్స్ - హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG Courts Recruitment 2025 Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లోని కోర్టుల్లో 1,673 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. నేటి నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు 2025

తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటికే ఆ గడువు కూడా పూర్తయింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్లు నేటి(ఏప్రిల్ 8) నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటిని హైకోర్టు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  1. కోర్టు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్, స్కిల్ టెస్ట్ హాల్ టికెట్లు అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఈ పరీక్షలు ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. షిప్టులవారీగా నిర్వహిస్తారు. షిప్ట్ 1, 2, 3లుగా ఉంటాయి. షిఫ్ట్ 1, 2 పరీక్షలు 15 నుంచి 20వ తేదీ వరకు ఉన్నాయి. ఇక షిఫ్ట్ 3 పరీక్షలు 18 నుంచి 20 తేదీల్లో పూర్తవుతాయి.

  • ఎగ్జామినర్ - 15 ఏప్రిల్ , 2025
  • జూనియర్ అసిస్టెంట్ - 16 ఏప్రిల్ , 2025
  • ఫిల్డ్ అసిస్టెంట్ -20 ఏప్రిల్ , 2025
  • రికార్డ్ అసిస్టెంట్ - 15 ఏప్రిల్ , 2025(స్కిల్ టెస్ట్)
  • టైపిస్ట్ - 15 ఏప్రిల్ 2025 (స్కిల్ టెస్ట్)

ఇక నోటిఫికేషన్ ద్వారా పలు జిల్లాల్లోని 1,673 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇందులో 1,277 నాన్-టెక్నికల్ పోస్టులు, 184 టెక్నికల్ పోస్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్‌లోని 212 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, అసిస్టెంట్లు, కోర్ట్ మాస్టర్లు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, కాపీయిస్టులు వంటి క్లరికల్ పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలన్నీ కూడా శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలతో పాటు స్కిల్స్ టెస్ట్ ఆధారంగా తుది జాబితాలను ప్రకటిస్తారు. అయితే పోస్టుల వివరాలతో కూడిన నోటిఫికేషన్లు హైకోర్టు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.