తెలుగు న్యూస్ / career /
OU PhD Entrance Test 2025 : ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ - మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
OU PhD Entrance Test Syllabus 2025: ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం అధికారులు సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఓయూ అధికారిక వెబ్ సైట్ నుంచి సబ్జెక్టుల వారీగా సిలబస్ వివరాలను చూడొచ్చు.
ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్
ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మార్చి 1వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. అయితే అధికారులు తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ పరీక్ష సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సబ్జెక్టుల వారీగా పీడీఎఫ్ కాపీలను విడుదల చేశారు.

ఇలా డౌన్లోడ్ చేసుకోండి….
- పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్టుకు అర్హత ఉన్న అభ్యర్థులు ఉస్మానియా యూనివర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే Syllabus లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. సబ్జెక్టుల వారీగా పేర్లు డిస్ ప్లే అవుతాయి.
- మీరు ఏ సబ్జెక్టుకు దరఖాస్తు చేసుకున్నారో అక్కడ క్లిక్ చేయాలి.
- క్లిక్ చేయగానే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి సిలబస్ కాపీని పొందవచ్చు.
పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 50 శాతంతో మిగిలిన వారు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 70 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు.
- లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్ పరీక్ష ఇంగ్లీష్ భాషలోనే నిర్వహిస్తారు. అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు.
- ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది.
- ఇంకా డిగ్రీ ఫలితాలు వెలువడని వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు పిహెచ్‌డి ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించారు.
ముఖ్య తేదీలు:
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 1 మార్చి 2025
- రూ. 2వేల ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 11 మార్చి 2025.
- మార్చి చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ouadmissions.com/
సంబంధిత కథనం