ఐసీఏఐ సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ ఎగ్జామ్ మే 2025 పరీక్షల అడ్మిట్ కార్డులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా త్వరలో విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ eservices.icai.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది.
ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు 2025 మే 2 నుండి మే 14, 2025 వరకు జరుగుతాయి. ఇంటర్మీడియెట్ కోర్సు గ్రూప్-1 పరీక్షను 2025 మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్-2 పరీక్షను మే 9, 11, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. మే 2, 4, 6 తేదీల్లో గ్రూప్-1, మే 8,10,13 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని ఇంటర్మీడియట్ కోర్సు పేపర్లు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-1 నుంచి 5 వరకు, పేపర్-6 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
సీఏ ఫౌండేషన్ కోర్సు పరీక్ష 2025 మే 15, 17, 19, 21 తేదీల్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-1, పేపర్-2 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-3,4 పరీక్షలను నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
సంబంధిత కథనం