AP Inter Results 2025 : రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. ఇలా అప్లై చేసుకోండి-how to apply for ap intermediate 2025 recounting and revaluation 7 simple tips ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Inter Results 2025 : రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. ఇలా అప్లై చేసుకోండి

AP Inter Results 2025 : రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. ఇలా అప్లై చేసుకోండి

AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 17 వేల 102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే.. తాజాగా విడుదల చేసిన ఫలితాలపై అనమానాలు ఉంటే.. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ ఇంటర్ ఫలితాలు (istockphoto)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రెండేళ్లకు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్లతోపాటు మన మిత్ర వాట్సప్‌ యాప్‌లోనూ పొందవచ్చు. వాట్సప్‌ నంబరు 95523 00009కు హాయ్‌ అని ఎస్‌ఎంఎస్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. అవసరమైన సమాచారాన్ని అందిస్తే పీడీఎఫ్‌ రూపంలో ఫలితాలు వస్తాయి.

ఈ ఫలితాలపై సంతృప్తిచెందని విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

7 సింపుల్ స్టెప్స్..

1.ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. https://bieap.apcfss.in/.

2.దాంట్లో "Reverification / Recounting of marks" లింక్‌ను ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

3.హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడి వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

4.ఆ తర్వాత "Get Data" పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై కనిపించే మీ వివరాలను సరి చూసుకోవాలి.

5.మీరు రీ కౌంటింగ్ లేదా రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలి.

6.ప్రతి సబ్జెక్ట్‌కు రీ కౌంటింగ్‌కు, రీ వాల్యుయేషన్‌కు కొంత ఫిజు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.

7.ఫీజు చెల్లించిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం స్క్రీన్‌పై కనిపించే అప్లికేషన్ నంబర్‌ను తప్పకుండా నోట్ చేసుకోవాలి.

ముఖ్యమైన విషయాలు..

రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు. మార్కులలో ఎలాంటి మార్పు లేకపోయినా సరే ఇవ్వరు. రీ వాల్యుయేషన్ తర్వాత వచ్చే మార్కులే తుది మార్కులుగా పరిగణించబడతాయి. మార్కులు తగ్గినా కూడా అంగీకరించాల్సి ఉంటుంది. రీ వాల్యుయేషన్ కోసం అప్లై చేసే విద్యార్థులకు వారి జవాబు పత్రాల స్కానింగ్ కాపీ కూడా ఇందిస్తారు.

 

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం