AP High court : ఏపీలో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, పూర్తి వివరాలు ఇవే
AP High court : ఏపీలో ఖాళీగా ఉన్న సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. వీటిలో పదింటిని బదిలీల ద్వారా, 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా హైకోర్టు విడుదల చేసింది. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే 40 పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగతా 10 పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
మార్చి 17 వరకు..
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అయినా దీంట్లో పోస్టు చేస్తారు.
పోస్టుల విభజన..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ కేటగిరీల వారీగా పోస్టులను విభజించారు. ఏప్రిల్ 16న పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 22వ తేదీన ప్రిలిమినరి కీ విడుదల చేస్తారు. ఏదైనా కారణాల వల్ల ఈ తేదీల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఏవైనా మార్పులు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు.
ముఖ్య వివరాలు..
నోటిఫికేషన్ విడుదల- 14.02.2025
అప్లికేషన్‌కు అవకాశం- 20.02.2025 నుంచి 17.03.2025 వరకు
హాల్ టికెట్లు విడుదల- 07.04.2025 (16వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి)
పరీక్ష తేదీ- 16.04.2025
ప్రైమరీ కీ- 22.04.2025
జీతం- రూ.77,840 నుంచి రూ.1,36,520
దరఖాస్తు ఫీజు- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500
వయో పరిమితి- 01.02.2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
అర్హతలు- పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా) ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక - రాత పరీక్ష ఆధారంగా