డీఎస్సీ పరీక్షలు రాయబోయే అభ్యర్థులు.. హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులకు పరీక్షా సమయం రెండున్నర గంటలు ఉంటుంది. పీజీటీ, ప్రిన్సిపల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పరీక్షా సమయం మూడు గంటలు ఉంటుంది. ఇంగ్లీష్ ప్రోఫిసియెన్సీ టెస్ట్ పరీక్షా సమయం ఒకటిన్నర గంటలు ఉంటుంది.
నాన్ లాంగ్వేజ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, నాన్ లాంగ్వేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పరీక్షల తేదీల సమాచారం, హాల్ టికెట్లను అభ్యర్థులు వెబ్ సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు హెల్ప్ డెస్క్‌కు కాల్ చేయవచ్చు. (6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286, 9963069286, 7013837359) నంబర్లకు ఫోన్ చేసి.. అభ్యంతరాలను నివృత్తి చేసుకోవచ్చు. dscgrievances@apschooledu.in ఐడీకి మెయిల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అని డీఎస్సీ కన్వీనర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి వివరించారు.
వాట్సప్ ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 95523 00009 నంబర్‌కు మెసేజ్ చేసి.. హాల్ టికెట్లు పొందవచ్చని విద్యాశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం 16 వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు.
ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేయడంతో.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఆప్షన్లు స్వీకరించారు. ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
సంబంధిత కథనం