పీహెచ్ డీ ప్రవేశాల కోసం హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు ఏప్రిల్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2025 విద్యా సంవత్సరానికి(జులై 2025 సెషన్) పలు సబ్జెక్టుల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్ లో అడ్మిషన్లు కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 600, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 550 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ. 400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 275 చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫీజును కూడా ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాలి.
అర్హత సాధించే అభ్యర్థులు పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, హింది, హిస్టరీఅంత్రపాలజీ, ఎడ్యుకేషన్, రీజినల్ స్టడీస్, పోక్ కల్చర్ స్టడీస్, తెలుగు, అప్లైడ్ లాంగ్వేజెస్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్ తో పాటు మరికొన్ని విభాగాల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఎంట్రెన్స్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. హైదరాబాద్ తో పాటు భువనేశ్వర్, కొచ్చి, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతా, గౌహతి ఎగ్జామ్ సెంటర్లుగా ఉన్నాయి.