ఏపీ మెగా డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. గత నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల స్వీకరణ గడువు మే 15తో ముగుస్తుంది.మే 15తో ముగియనున్న డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ
ఏపీ మెగా డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు త్వరతగతిన దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం మెగా డీఎస్సీ -2025 దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15తో ముగుస్తుంది.చివరి నిమిషంలో రద్దీని సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా ముందే దరఖాస్తులు సమర్పించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
డిఎస్సీ ఆశావహులు చివరి రోజు వరకూ ఆగకుండా, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సూచించారు.ఏప్రిల్ 20వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటివరకు డిఎస్సీకి 3,03,527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 4,77,879 ల దరఖాస్తులు అందాయి. మే 15వ తేదీ వరకు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగనుంది.
డిఎస్సీ నిర్వహణ కోసం అభ్యర్థులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. 2024లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనా ఎన్నికల కోడ్ రావడంతో అది జరగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు ఏడాది కాలంగా డిఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం లక్షలాది మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌లో అప్లై చేసే సమయంలోనే ధృవపత్రాలు అప్‌లోడ్ చేయాలని నిబంధన విధించారు. దీంతో అభ్యర్థులు కీలకమైన పరీక్షల సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంతో డిఎస్సీ నోటిఫికేషన్‌లో విధించిన పలు నిబంధనలతో అభ‌్యర్థులు ఇబ్బందులు పడుతుండటంత వాటిని సవరిస్తున్నట్టు నారా లోకేష్ ప్రకటించారు.
దరఖాస్తు చేసే సమయంలోనే సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలనే నిబంధనతో అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. డిఎస్సీకి దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాల కోసం కీలకమైన సమయం వృధా అవుతున్న విషయాన్ని గుర్తించిన మానవ వనరుల శాఖ మంత్రి నారాలోకేష్ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడం ఆప్షనల్ మాత్రమేనని, సర్టిఫికెట్ వెరిఫకేషన్ సమయంలో ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు.
గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల నిబంధనల్లో కూడా సడలింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లలో కనీస విద్యార్హత 40శాతంగా నిర్ణయించినట్టు ప్రకటించారు. కనీసం 45-50శాతం మార్కుల ఉండాలని తొలుత నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో లక్షలాది మందికి డిఎస్సీకు దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అర్హత మార్కులను తగ్గించారు.
సంబంధిత కథనం