Guntur Jobs : గుంటూరు జిల్లాలో వైద్యారోగ్య శాఖలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తులకు ఆఖరు తేదీ ఎప్పుడంటే?
Guntur Jobs : గుంటూరు జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
Guntur Jobs : గుంటూరు జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆఖరు తేదీగా జనవరి 7న నిర్ణయించారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయంలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) కొర్రా విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 19 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఎన్ని పోస్టులు?
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసేందుకు మొత్తం 19 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్-II) (కాంట్రాక్ట్) -5, ఎఫ్ఎన్ఓ (ఔట్‌సోర్సింగ్) -14 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నెలవారీ జీతాలు
1. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్-II) పోస్టుకు రూ. 32,670, ఎఫ్ఎన్ఓ పోస్టుకు రూ.రూ.1,5000
వయో పరిమితి
ఉద్యోగాలకు దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటా వారికి ఎనిమిదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
అర్హతలు
1. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్-II) పోస్టులకు మెడికల్ ల్యాబ్‌లో డిప్లొమా పూర్తి చేయాలి. పదో తరగతి పూర్తి చేయాలి. లేదంటే, రెండేళ్ల ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేయాలి. లేదంటే ఏడాది అప్రాంటీస్ పూర్తి చేయాలి.
2. ఎఫ్ఎన్ఓ పోస్టులకు పదో తరగతి పూర్తి చేయాలి.
అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు, ఎక్స్‌సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.200 ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించుకోవచ్చు. యూపీఏ పేమెంట్స్ ద్వారా చెల్లించవ్చు. అలాగే డీడీ, యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు. బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ పేరు మెడికల్ కాలేజీ బ్రాంచ్, గుంటూరు, అకౌంట్ నెంబర్ః 100710100054512, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ః UBIN8110070
నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ లింకులో...
ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2024/12/2024122461.pdf క్లిక్‌చేస్తే ఓపెన్ అవుతాయి.
దరఖాస్తు ఇలా చేసుకోండి
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2024/12/2024122426.pdf ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి. సంబంధిత సర్టిఫికేట్ల, ఆన్‌లైన్‌లో చెల్లించిన అప్లికేషన్ ఫీజు రిసిప్ట్ జతచేసి, గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి దరఖాస్తును రిజిస్ట్రార్ పోస్టు చేయాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌వో) కార్యాలయం, కలెక్టరేట్ ఎదురుగా, నగరంపాలెం, గుంటూరుకు దరఖాస్తును పంపించాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం